Prasanth Varma: ఆ కారణం వల్లే విరాళంగా ఇస్తున్న హనుమాన్ టీం.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ విడుదలైన కొన్ని రోజులకే జై హనుమాన్ సినిమా పనులను మొదలుపెట్టారు. చాలామంది టాలీవుడ్ డైరెక్టర్లు ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటుండగా ప్రశాంత్ వర్మ మాత్రం ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమా పనులను మొదలుపెడుతూ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. వర్క్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. హనుమాన్ మూవీ కలెక్షన్లలో ఒక్కో టికెట్ కు 5 రూపాయల చొప్పున హనుమాన్ టీమ్ అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.

హనుమాన్ టీమ్ చేసిన ఈ ప్రకటన రామ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ అయోధ్య రామునికే కాదు భద్రాద్రి రామునికి కూడా విరాళం ఇస్తామని వెల్లడించడం గమనార్హం. చిన్న ఆలయాలకు కూడా విరాళాలను అందించాలని భావిస్తున్నామని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ప్రశాంత్ వర్మ ప్రముఖ దేవాలయాలకు విరాళం రూపంలో సినిమాల కలెక్షన్లలో కొంత మొత్తాన్ని ఇవ్వడం అద్భుతమైన నిర్ణయమని భవిష్యత్తులో ఎంతోమందికి ఇలా విరాళాలు ప్రకటించే విషయంలో హనుమాన్ టీమ్ స్పూర్తిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హనుమాన్ మూవీ ద్వారా వచ్చిన కలెక్షన్లు, లాభాలను సీక్వెల్ కోసం వినియోగిస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు కూడా హనుమాన్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్నాయి. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల దిశగా హనుమాన్ మూవీ అడుగులు పడుతున్నాయి. పెద్ద హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంటోంది.

హనుమాన్ ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. హనుమాన్ విజయం సాధించడంతో ఈ తరహా కాన్సెప్ట్ సినిమాల దిశగా టాలీవుడ్ అడుగులు పడుతున్నాయి. సినిమా చూసిన ప్రతి వ్యక్తి తమ సాయంగా దేవుడికి విరాళం ఇచ్చినట్టేనని హనుమాన్ టీం విరాళం ఇస్తున్నట్టు తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus