కే జి ఎఫ్ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీకి మరొక మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రశాంత్ సినిమాలను కనుక చూస్తే ఈయన సినిమాలన్నీ కూడా మనకు డార్క్ ఫ్రేమ్ లోనే కనిపిస్తుంటాయి. ఎక్కడా కూడా సినిమాలలో రంగులు అనేవి కనిపించవు. ఈయన చేసిన ఉగ్రం సినిమా అలాగే కే జి ఎఫ్ సినిమాలు కూడ ఇలానే ఉన్నాయి తాజాగా రాబోయే సలార్ సినిమా కూడా అలాగే ఉంటుంది.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఇదే ప్రశ్న ఎదురయింది. మీ సినిమాలన్నీ ఎందుకు ఇలా డార్క్ షెడ్ లోనే ఉంటాయి కలర్ ఫుల్ గా ఎందుకు ఉండవు అనే ప్రశ్న ప్రశాంత్ కు ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ.. నాకు ఓసిడి అనే సమస్య ఉంది. అందుకే ఎక్కువ కలర్స్ ఉంటే నాకు ఏది నచ్చదని ప్రశాంత్ తెలిపారు.
నా (Prashanth Neel) పర్సనల్ థాట్స్ అక్కడ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే నా సినిమాలు ఎప్పుడు అలానే ఉంటాయని ప్రశాంత్ తెలిపారు. అయితే నా సినిమాలకు ఒకదానికొకటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు.ఇక పోతే కేజీఎఫ్ సినిమాకు సలార్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ప్రశాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.