Devara 2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
- January 27, 2026 / 07:05 PM ISTByFilmy Focus Writer
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవర’ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది. అయితే ఆ సినిమా తర్వాత తారక్ తన తదుపరి చిత్రాలతో బిజీ అయిపోవడంతో, సీక్వెల్ ఉంటుందా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ముఖ్యంగా కొరటాల శివ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ పుకార్లకు నిర్మాత తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు.
Devara 2
సినిమా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేవర 2 పనులు ఆగిపోలేదని స్పష్టం చేశారు. 2026 మే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నామని, 2027లో రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లూ వస్తున్న రూమర్లకు ఒక క్లారిటీ వచ్చినట్లయింది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నందున, ఆ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చాకే దేవర సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
మరోవైపు దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంపై వచ్చిన కొన్ని విమర్శలను దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్‌లో కథనం, విజువల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కూడా స్క్రిప్ట్ వంద శాతం ఓకే అంటేనే షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్‌గా జరుగుతున్నాయి.
దేవర సీక్వెల్ విషయంలో మేకర్స్ ఒక టైమ్ లైన్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అనిరుధ్ మ్యూజిక్, సముద్రం నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ పార్ట్‌లో కూడా కీలకం కానున్నాయి. నిర్మాత ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో తారక్ ఫ్యాన్స్‌లో ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.















