Prashanth Neel, NTR: తారక్‌ కోసం నీల్‌ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయట!

Advertisement

అనౌన్స్‌మెంట్‌తో ఓ రేంజ్‌ హైప్‌ తెచ్చుకున్న చిత్రం #NTR31.. అదేనండీ తారక్‌ – ప్రశాంత్‌ నీల్‌. ఈ కాంబోలో సినిమా వస్తోంది అని తెలిసేసరికి ఫ్యాన్స్ ఫుల్‌ ఖుష్‌ అయిపోయారు. ఆ తర్వాత తారక్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రశాంత్‌ నీల్‌ చెప్పేసరికి.. తారక్‌ను హై ఓల్టేజ్‌ యాక్షన్‌లో చూపిస్తాడని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. ఇంతలోనే ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ నటిస్తారని వార్తలొచ్చాయి. దీంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్‌కి చేరిపోయాయి. కానీ అది కేవలం పుకారు మాత్రమే అని అన్నారు. అలా ఇప్పుడు మరో పుకారు బయటికొచ్చింది.

తారక్‌ సినిమాలో ఆయనకు సమానంగా ఉండే పాత్ర అనేసరికి.. ఆ క్యారెక్టర్‌కి సూపర్‌ ఇంపార్టెన్స్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పాత్రను కమల్‌ చేస్తున్నారని చెప్పారు. దీంతో కమల్‌ – తారక్‌ కాంబో గురించి వెయిట్‌ చేద్దాం అనుకున్నారు. అయితే కమల్‌ ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో ప్రశాంత్‌ మరో సీనియర్‌ యాక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారట. అతను ఇప్పటికే తారక్‌తో నటించడంతో.. ఈ డీల్‌ ఓకే అవ్వొచ్చని చెబుతున్నారు.

‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో మోహన్‌లాల్‌ – తారక్‌ కాంబోను చూసి ప్రేక్షకులు వావ్‌ అనుకున్నారు. ఇద్దరి స్క్రీన్‌ ప్రజెన్స్‌ అంతలా అదిరిపోయింది అని చెప్పాలి. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుంటే ఫ్యాన్స్‌ ఈలలు, కేకలు ఇంకా చాలామందికి చెవుల్లో మారుమోగుతుంటాయి. అందుకే తన సినిమాకు లాలెటన్‌ (మోహన్‌లాల్‌)ను తీసుకోవాలని ప్రశాంత్‌ చూస్తున్నారట. త్వరలో ఆయన్ను కలసి కథ, పాత్ర గురించి వివరించాలని అనుకుంటున్నారని టాక్.

కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమాను ప్రారంభిస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు రెండు సినిమాల్ని పారలల్‌గా చేయాలని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలో కొరటాల శివ సినిమా స్టార్ట్‌ అవుతుంది. దసరా నుండి ప్రశాంత్‌ నీల్‌ సినిమా స్టార్ట్‌ చేయాలని చూస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే తారక్‌ నుండి వెంటవెంటనే రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news