Prashanth Neel, Jr NTR: హిట్‌ బ్యాక్‌డ్రాప్‌… తొలిసారి లైవ్‌ ప్లేస్‌లో ప్రశాంత్‌ నీల్‌ సినిమా..!

Ad not loaded.

తెలుగు సినిమాకు హిట్‌ బ్యాక్‌డ్రాప్స్‌ కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతం నేపథ్యంలో తీసిన సినిమాలు చాలా వరకు విజయం అందుకున్నాయి. కొన్ని అయితే ఇండస్ట్రీ హిట్‌లు, కెరీర్‌ హిట్లు కూడా అయ్యాయి. వాటిలో కోల్‌కతా ఒకటి. అక్కడి బ్యాక్‌డ్రాప్‌లు చేసిన సినిమాల్లో కచ్చితంగా విజయం సాధిస్తాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే బ్యాక్‌డ్రాప్‌లో తారక్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా సిద్ధమవుతుంది అని సమాచారం. ఎన్టీఆర్‌ (Jr NTR) – దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)  కలయికలో ఓ పాన్‌ ఇండియా సినిమా రూపొందనుంది.

Prashanth Neel, Jr NTR:

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకుంటుంది అని చెబుతున్నారు. అయితే తొలి షెడ్యూల్‌లో తారక్‌ ఉండడట. ఆయన లేని సీన్స్‌ తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఎన్టీఆర్‌ మార్చి రెండు లేదా మూడో వారంలో అందుబాటులోకి వస్తారు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉండబోతోంది. అక్కడ ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ సెట్‌ను సిద్ధం చేస్తున్నారట.

అందులోనే సినిమా రెండో షెడ్యూల్‌ మొదలు పెడతారు అని తెలుస్తోంది. పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth)  కనిపించనుందని భోగట్టా. అలాగే మలయాళ హీరో టొవినో థామస్‌ (Tovino Thomas) కూడా నటిస్తున్నారట. ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో రియల్‌ ప్రాంతాలు చూపించరు. ఇప్పటివరకు చేసిన పెద్ద సినిమాలు ‘కేజీయఫ్‌’లు (KGF), ‘సలార్‌’లో (Salaar)  ఊహాజనిత ప్రాంతాలే ఉంటూ వచ్చాయి.

మరిప్పుడు తారక్‌కు నిజమైన ప్రాంతాన్నే చూపించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా సినిమాను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్‌ చేసుకొని బరిలోకి దిగారట. ‘సలార్‌ 2’ ఆపేసి మరీ ఈ సినిమా మొదలుపెట్టడానికి అదే కారణం అని చెబుతున్నారు. చూద్దాం తొలిసారి ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) చేస్తున్న లైవ్‌ సినిమా ఎలా ఉంటుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus