NTR31: తారక్‌ – నీల్‌ సినిమాపై అఫీషియల్‌ అప్‌డేట్‌!

#NTR30 షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయంలో స్పష్టత రావడం లేదు కానీ.. #NTR31 షూటింగ్‌ గురించి అప్‌డేట్ వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే.. ఆ టైమ్‌కి జరుగుతుంది లేదో తెలియదు కానీ.. తారక్‌ నెక్స్ట్‌ సినిమా గురించి అప్‌డేట్‌ వచ్చింది. దీంతో సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ అభిమానుల సందడి మామూలుగా లేదు. ఇప్పుడు ఏ ట్విటర్‌ హ్యాండిల్‌లో చూసినా.. ఇదే చర్చ నడుస్తోంది. తారక్‌ – నీల్‌ సినిమా అప్పుడే మాట్లాడుకుంటున్నారు.

తారక్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కించనున్న చిత్రమే #NTR31. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ఈ సినిమాను ఘనంగా అనౌన్స్‌ చేశారు. అయితే ఆ తర్వాత దీనికి గురించి పెద్దగా అప్‌డేట్ లేదు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. సినిమా గురించి మాట్లాడాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో మొదలు కానుందట. ఏప్రిల్‌, మే నెలల్లోనే ప్రారంభించనున్నట్టు ప్రశాంత్‌ నీల్‌ సోమవారం వెల్లడించారు.

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘సలార్‌’ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. అంటే ఎన్టీఆర్‌ సినిమాను ఒకవైపు, ‘సలార్‌’ నిర్మాణానంతర కార్యక్రమాలు మరోవైపు చేయాలని ప్రశాంత్‌ నీల్‌ ఫిక్స్‌ అయ్యారన్నమాట. ‘కేజీయఫ్‌ 2’, ‘సలార్‌’ విషయంలోనూ ప్రశాంత్‌ నీల్‌ ఇలానే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా సమయంలోనూ అదే ఫాలో అవుతున్నారు.

ఇక ఎన్టీఆర్‌ తన 30వ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాల్లోనే ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం ఇప్పటికే మొదలవ్వాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. జూన్‌లో మొదలుపెడతారు, సెట్స్‌ కూడా రెడీ అనుకున్న ఈ సినిమా ‘ఆచార్య’ ఫలితం తర్వాత ఆలస్యమవుతూ వచ్చింది. జులై, ఆగస్టు అంటూ నెలలు దాటిన ఈ సినిమాకు ఇప్పుడు సెప్టెంబరు అని కొత్త డేట్‌ చెబుతున్నారు. మరి అప్పుడైనా ప్రారంభమవుతుందా? లేదా అనేది చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus