Prashanth Neel, Rajamouli: ఆ విషయంలో ప్రశాంత్ పై చేయి సాధించారా?

ప్రస్తుతం దేశంలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు మెజారిటీ ప్రేక్షకులు రాజమౌళి పేరు చెబుతారు. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో ఒకరైన రాజమౌళి తన సినిమాలలో కథ, కథనం కొత్తగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి కొందరు డైరెక్టర్లు కూడా వరుస విజయాలు సాధించినా రాజమౌళి స్థాయిలో పేరు సంపాదించుకోలేకపోయారు. అయితే రాజమౌళి నంబర్ వన్ స్థానానికి ప్రశాంత్ నీల్ నుంచి పోటీ ఎదురవుతోంది.

Click Here To Watch NOW

ఒక విషయంలో మాత్రం రాజమౌళిపై ప్రశాంత్ నీల్ పై చేయి సాధించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళికి 10వ సినిమా అయిన బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తే ప్రశాంత్ నీల్ కు రెండో సినిమా అయిన కేజీఎఫ్ ఛాప్టర్1 తోనే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 12 సినిమాలతో జక్కన్నకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చిందో మూడు సినిమాలతో ప్రశాంత్ నీల్ కు కూడా అదేస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళికి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించాలనే కోరిక ఉన్నా మగధీర సినిమాతోనే ఆ దిశగా అడుగులు పడ్డాయి. ప్రశాంత్ నీల్ మాత్రం రెండో సినిమాతోనే ఆ దిశగా అడుగులు వేశారు. ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే తీసినా ప్రశాంత్ నీల్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. రాజమౌళి చేసిన తప్పు ప్రశాంత్ నీల్ చేయలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తర్వాత సినిమా ప్రభాస్ హీరోగా సలార్ పేరుతో తెరకెక్కింది.

ఇప్పటికే ఈ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. సలార్ తో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ మూవీ 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus