Prashnath Neel: బాలీవుడ్ కు ప్రశాంత్ నీల్ భారీ షాక్ ఇవ్వనున్నారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్ కు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉగ్రం, కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించి ప్రశాంత్ నీల్ రేంజ్ ను పెంచాయి. ప్రస్తుతం 50 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్న అతికొద్ది మంది దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

2023 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ మూవీ రిలీజవుతుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరగడంతో కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సలార్ సినిమా థియేటర్లలో విడుదలయ్యే రోజునే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ఫైటర్ సినిమా రిలీజ్ కానుంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. సలార్ సినిమా కోసం హిందీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైటర్, సలార్ ఒకేరోజు థియేటర్లలో విడుదలైతే ఫైటర్ సినిమానే నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సలార్ రిలీజ్ డేట్ ప్రకటనతో హృతిక్ రోషన్ టెన్షన్ పడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న కథలతో సౌత్ సినిమాలు తెరకెక్కుతుండటంతో సౌత్ సినిమాలే బాలీవుడ్ పై పైచేయి సాధిస్తున్నాయి. సలార్ మూవీకి సంబంధించి ఇప్పటిలే పలుమార్లు రిలీజ్ డేట్లు మారిన నేపథ్యంలో సలార్ రిలీజ్ డేట్ మళ్లీ మారే ఛాన్స్ లేదని ఫైటర్ మూవీ రిలీజ్ డేట్ ను మార్చితే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus