‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘ప్రతీరోజు పండగే’. ఈ ఏడాది డీసెంట్ హిట్ కొట్టి ప్లాపుల నుండీ బయటపడిన సాయితేజ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఈ చిత్రం చేశాడు. ఇక రాశీ ఖన్నా ఈ చిత్రంలో ‘టిక్ టాక్’ కామెడీ తో బాగా ఎంటర్టైన్ చేసింది. రావు రమేష్, సత్య రాజ్ ల ట్రాక్ కూడా అలరించింది. ఇక నిన్న విడుదలైన (డిసెంబర్ 20న) ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను సాధించింది.
‘ప్రతీరోజూ పండగే’ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
1.25 cr
సీడెడ్
0.33 cr
ఉత్తరాంధ్ర
0.44 cr
ఈస్ట్
0.30 cr
వెస్ట్
0.22 cr
కృష్ణా
0.21 cr
గుంటూరు
0.30 cr
నెల్లూరు
0.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.42 cr
ఓవర్సీస్
0.68 cr
వరల్డ్ వైడ్ టోటల్
4.33 cr (share)
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 4.33 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో కూడా ఈ చిత్రం బుకింగ్స్ బాగున్నాయి. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే ఈ వీకెండ్ కే 70 శాతం రికవరీ సాధించే అవకాశం ఉంటుంది.