KGF2 Movie: తెలుగు రాష్ట్రాల్లో షాకిస్తున్న ‘కె.జి.ఎఫ్2’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

కన్నడ సినిమాలు వేరే భాషల్లోకి డబ్ అయితే జనాలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అక్కడి సినిమాలు చాలా వరకు రీమేక్ లే ఉంటాయి కాబట్టి. ఒక్క ఉపేంద్ర సినిమాలకి మాత్రమే తెలుగులో అంతంత మాత్రం క్రేజ్ ఉండేది. అయితే ‘కె.జి.ఎఫ్’ మూవీ అవన్నీ అపోహలే అని చెప్పకనే చెప్పింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ తెలుగులో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ మూవీ తెలుగు థియేట్రీక రైట్స్ కేవలం రూ.5 కోట్లకు మాత్రమే జరిగాయి.

Click Here To Watch NOW

కానీ ఫుల్ రన్లో ఈ మూవీ రూ.10 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసింది. అందుకే ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ని తెలుగులో భారీ రేట్లకి కొనుగోలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ ను మించి ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ బిజినెస్ చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు భీభత్సమైన క్రేజ్ ఉన్న ఈస్ట్ గోదావరిలో ‘భీమ్లా నాయక్’ బిజినెస్ రూ.6.7 కోట్లకు జరిగితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ బిజినెస్ రూ.7 కోట్లకి జరిగింది. ఉత్తరాంధ్రలో కూడా అంతే.

అక్కడ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకి భయంకరమైన క్రేజ్ ఉంటుంది. అక్కడ ‘భీమ్లా నాయక్’ బిజినెస్ రూ.9.2 కోట్లకి జరిగితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ బిజినెస్ రూ.10 కోట్లకి జరిగింది. దీంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పై తెలుగులో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. చిత్ర బృందం ఆల్రెడీ ప్రమోషన్లను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది.

అందులో రాఖీ భాయ్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ మూవీలో సంజయ్ దత్,రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి(హీరోయిన్) నటించారు. ఫస్ట్ సింగిల్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus