Keerthy Suresh, Samantha: ఆ ఫోటోని షేర్ చేసి ప్రీతమ్ తప్పు చేశాడా?

నాగచైతన్య సమంత విడాకుల ప్రకటన తర్వాత ప్రీతమ్ జుకల్కర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సమంత స్టైలిష్ట్ గా ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రీతమ్ వల్లే చైసామ్ విడిపోయారంటూ వార్తలు ప్రచారంలోకి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ప్రీతమ్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. ఈ విషయం సమంత దృష్టికి రావడంతో సమంత ప్రీతమ్ వల్ల తాను, చైతన్య విడిపోలేదంటూ పరోక్షంగా వివరణ ఇచ్చారు. ప్రీతమ్ సైతం సమంతను తాను అక్కా అని పిలుస్తానని చెప్పుకొచ్చారు.

చైతన్యకు కూడా తమ రిలేషన్ గురించి తెలుసని జరుగుతున్న ప్రచారాన్ని చైతన్య ఖండిస్తే బాగుంటుందని ప్రీతమ్ చెప్పుకొచ్చారు. చైసామ్ విడాకుల సమయంలో ప్రీతమ్ జుకల్కర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీస్ గురించి సైతం జోరుగా చర్చ జరిగిందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రీతమ్ జుకల్కర్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటోను షేర్ చేశారు. కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రీతమ్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలో సమంత, ప్రీతమ్ మధ్యలో కీర్తి సురేష్ ఉన్నారు. ప్రీతమ్ కీర్తి సురేష్ పై వాలి ఉండటంతో నెటిజన్లు ఈ ఫోటో గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ప్రీతమ్ పై ప్రస్తుతం నెటిజన్లలో నెగిటివ్ ఒపీనియన్ ఉన్న నేపథ్యంలో అతను ఇలాంటి ఫోటోలను షేర్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ప్రీతమ్ సోషల్ మీడియాలో నెగిటివిటీని అంతకంతకూ పెంచుకుంటున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus