Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాలెన్ని, చేస్తాను అని ఒప్పుకుంటున్న సినిమాలెన్ని, వింటున్న కథలెన్ని.. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసుకుంటూ బిజీ బిజీగా వెళ్లిపోతున్నాడు ప్రభాస్‌. మరోవైపు కొత్త కథలు వింటున్నాడు అనే మాటలు కూడా ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్నాయి. వాటి సంగతే తేలడం లేదు అంటే ఇప్పుడు మరో కొత్త దర్శకుడి కథను ప్రభాస్‌ ఓకే చేశాడు అనే మాటలు చక్కర్లు కొడుతున్నాయి.

Prem Rakshith, Prabhas

ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమా లిస్ట్‌.. సెట్స్‌ మీదకు వెళ్లాల్సిన సినిమాల లిస్ట్‌ కలిపి చూస్తే పెద్దదే ఉంది. ఇప్పుడు సెట్స్‌ మీద ‘రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ ఉన్నాయి. ఆ తర్వాత ‘స్పిరిట్‌’ సినిమా మొదలవుతుంది అని చెబుతున్నారు. ఈ రెండూ కాకుండా ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ‘బ్రహ్మరాక్షస’ అంటూ ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేస్తాడు అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ పేరు కూడా ఈ చర్చల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రేమ్‌ రక్షిత్ కెప్టెన్సీ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన కథను ఇటీవల ప్రభాస్‌కి వినిపించారు అని సమాచారం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది కానీ నిజమే అంటున్నారు. అంతే కాదు ఆ సినిమా పాన్ ఇండియాకు సూటయ్యే కథ అట. అయితే ఆ కథ ప్రభాస్‌ కోసమేనా లేక తన యూవీ క్రియేషన్స్‌లో ఇంకేదైనా హీరోతో చేయడానికా అనే డౌట్‌ ఒకటి బయటకు వచ్చింది.

ఎందుకంటే యూవీ క్రియేషన్స్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. అందుకోసం ఏమన్నా ప్రభాస్‌ విన్నాడా అనేది తెలియాలి. అదేంటి కథ విని ఆయనే చేసుకుంటాడు కదా అని అనుకుంటున్నారా? ప్రభాస్‌ లైనప్‌ పైన చెప్పాం కదా.. ఎంత బిజీగా ఉందో ఈ సమయంలో కొత్త కథకు ఓకే చెప్పి ముందుకెళ్తాడా అనేదే ఇక్కడ పాయింట్‌.

రెండు సీక్వెల్స్‌ ఒకేసారి తెరపైకి.. సాధ్యమేనా? తేజ రిస్క్‌ చేస్తున్నాడా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus