అభిమాన ప్రేక్షకుల కోసం ‘ప్రేమాలయం’ కట్టిస్తున్నాడు!

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిద్ధార్థ కొంచెం విరామం తర్వాత తన ‘ప్రేమాలయం’లోకి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తమిళంలో సిద్ధార్ధ నటించగా ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతొ అనువదిస్తున్నారు.

మాణిక్యం ఆర్ట్ ధియేటర్స్ పతాకంపై శ్రీమతి పి.సునీత సమర్పణలో యువ నిర్మాత శ్రీధర్ యచ్చర్ల ఈ చిత్రాన్నితెలుగులో నిర్మిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ సరసన వేదిక, అనైక సోఠి హీరోయిన్స్ గా నటించగా.. మలయాళ టాప్ స్టార్ పృథ్వి రాజ్ ప్రతి నాయక పాత్ర పోషించారు.
నిర్మాత శ్రీధర్ యచ్చర్ల మాట్లాడుతూ.. సిద్ధార్ధ హీరోగా నటించి.. ప్రపంచ ప్రఖ్యాత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ‘ప్రేమాలయం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అరుదైన అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది. వసంత్ బాలన్ దర్శకత్వ ప్రతిభ, సిద్దార్ధ, పృథ్విరాజ్, నాజర్ ల నటన, వేదిక, అనైక సోఠిల గ్లామర్.. వనమాలి, కందికొండ అందించిన పాటలు, రాజశేఖర్ రెడ్డి మాటలు ‘ప్రేమాలయం’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. త్వరలోనే పాటలు విడుదల చేసి.. మార్చ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus