Premalu Review in Telugu: ప్రేమలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 8, 2024 / 07:20 PM IST

Cast & Crew

  • నల్సెన్ కె.గఫూర్ (Hero)
  • మమిత బైజు (Heroine)
  • సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ తదితరులు.. (Cast)
  • గిరీష్ ఏడి (Director)
  • ఫహాద్ ఫాజిల్ - దిలీష్ పోతన్ - శ్యామ్ పుష్కరన్ (Producer)
  • విష్ణు విజయ్ (Music)
  • అజ్మల్ సాబు (Cinematography)

గత నెల మలయాళంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న చిత్రం (Premalu) “ప్రేమలు”. హైద్రాబాద్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ మలయాళ చిత్రానికి యావత్ దక్షిణభారతంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకెళుతుండడం సినిమా ఏస్థాయి విజయం సాధించింది అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఈ చిత్రాన్ని తెలుగులో అనువాద రూపంలో అందించాడు (Rajamouli) రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ. నేడు (మార్చి 8) విడుదలైన ఈ కామెడీ ఎంటర్ టైనర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: సచిన్ (నల్సెన్) & రీను (మమిత) రకరకాల కలలతో హైద్రాబాద్ చేరుకుంటారు. సచిన్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఫారిన్ లో పీజీ చేయడానికి సన్నద్ధమవుతుండగా.. కొత్తగా ఉద్యోగంలో చేరి, హైద్రాబాద్ లో ఫ్రీడం & ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటుంది రీను. ఈ ఇద్దరూ ఓ పెళ్ళిలో పరిచయమై.. అనంతరం స్నేహితులుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కట్ చేస్తే.. రీనూను ప్రేమించడం మొదలెడతాడు సచిన్. అయితే.. రీను సీనియర్ కొలీగ్ అయిన ఆది (శ్యామ్ మోహన్) అడ్డంకిగా నిలుస్తాడు. ఈ ప్రేమల ప్రయాణం ఎలా సాగింది? అనేది “ప్రేమలు” చూసి తెలుసుకోవాలన్నమాట!

నటీనటుల పనితీరు: పలు మలయాళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన (Naslen K) నల్సెన్ ఈ చిత్రంలో సచిన్ అనే ఆధునిక యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే మమిత (Mamitha Baiju) కూడా రీను క్యారెక్టర్ లో జీవించేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ క్యూట్ గా ఉండగా.. ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆది పాత్రలో శ్యామ్ మోహన్ (Shyam Mohan) నటన కూడా అలరిస్తుంది. స్నేహితుడిగా నటించిన సంగీత్ ప్రతాప్ (Sangeeth Prathap) పంచ్ డైలాగులు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

సాంకేతికవర్గం పనితీరు: తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి “90’s” ఫేమ్ ఆదిత్య హాసన్ రాసిన సంభాషణలు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. యూత్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని మీమ్స్ డైలాగ్స్ తో ఒరిజినాలిటీకి ఎక్కడా ఇబ్బందిలేకుండా రాసిన డైలాగ్స్ హిలేరియస్ గా వర్కవుటయ్యాయి. ఇక.. విష్ణు విజయ్ సంగీతం, అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణలు.

దర్శకుడు గిరీష్ (Girish A. D.) చాలా సింపుల్ స్టోరీని అంతే సింపుల్ స్క్రీన్ ప్లేతో, ఆద్యంతం అలరించే విధంగా రాసుకున్న విధానం బాగుంది. ఎక్కడా విపరీతమైన ఎమోషన్స్ కు దారి ఇవ్వకుండా సింపుల్ సీన్స్ తో నడిపిన విధానం బాగుంది. అలాగే.. ఓ మలయాళ సినిమాలో హైద్రాబాద్ ను ఇంత అందంగా చూపించిన విధానం ప్రశంసనీయం.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా.. ఒక సింపుల్ సినిమా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి అనుకునే ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన సినిమా “ప్రేమలు”. ముఖ్యంగా.. యూత్ ఆడియన్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో చూడాల్సిన సినిమా ఇది.

ఫోకస్ పాయింట్: సుత్తి లేని సెన్సిబుల్ & కామికల్ “ప్రేమలు”

రేటింగ్:3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus