బిగ్ బాస్ 8 : యష్మీ, సోనియా..లకి ట్విస్ట్ ఇచ్చిన ప్రేరణ.!

బిగ్ బాస్ హౌస్‌ 8 (Bigg Boss 8 Telugu) రసవత్తరంగా సాగుతుంది. ఇప్పుడు హౌస్ కి కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత  (Kirrak Seetha)  ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంతార టీం బాధ్యతల్ని ఆమె స్వీకరించింది. టీం మెంబర్స్ ఎంపికలో కూడా చాలా హుషారుగా వ్యవహరించింది సీత. ఇప్పుడున్న కంటెస్టెంట్లలో సోనియా, పృథ్వీ(Prithviraj) ..లని మినహాయిస్తే.. మిగిలిన వాళ్ళంతా సీత టీంలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం విశేషంగా చెప్పుకోవాలి. నిఖిల్  (Nikhil)  టీంలో సోనియా ఉంది కాబట్టి..

Bigg Boss 8 Telugu

మిగిలిన వాళ్ళు ఆ టీంకి  వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. విష్ణు ప్రియ (Vishnu Priya) అయితే నిఖిల్ టీం గురించి ముందుగానే ఓ సెటైర్ వేసింది. ‘ఆ టీంలోకి వెళ్లినా గుర్తింపు ఉండదు అన్నట్టు’..! ఇక సోనియా కూడా నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇష్టం కాబట్టి.. అతని టీంలో ఉంటాను అన్నట్టు కవరింగ్ రీజన్ చెప్పింది. పృథ్వీ కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాడు. మరోపక్క.. నైనిక  (Nainika), ,నబీల్  (Nabeel Afridi) కూడా సీత టీంలో చేరారు. ఈ క్రమంలో ప్రేరణ (Prerana)  మైండ్ గేమ్ (Bigg Boss 8 Telugu) ఆడి..

మణికంఠ (Naga Manikanta), యష్మీ (Yashmi Gowda)  ..లని నిఖిల్ టీంలోకి వెళ్లేలా చేసింది. ‘స్వైప్ ఆప్షన్’ ను ఆధారం చేసుకొని ప్రేరణ అలా మైండ్ గేమ్ ఆడటం జరిగింది. సోనియా,యష్మీ..లకి అస్సలు పడదు అనే సంగతి తెలిసిందే. అందుకే ‘ఒకే వరలో రెండు కత్తులు’ అన్నట్టు వాళ్లపై సెటైర్లు కురుస్తున్నాయి. కాంతార క్లాన్ లో… సీత (చీఫ్),నైనిక,విష్ణు ప్రియ,ప్రేరణ,ఆదిత్య ఓం (Aditya OM) ,నబీల్ వంటి వారు ఉన్నారు. శక్తి అదే నిఖిల్ క్లాన్లో.. నిఖిల్ (చీఫ్),సోనియా,పృథ్వీ,యష్మీ గౌడ,మణికంఠ వంటి వారు ఉన్నారు.

పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏమైందంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus