ఏ హీరో అభిమానులకైనా తమ హీరో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఎంతో గర్వంగా చెప్పుకోవడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవుతుంటారు. అందుకోసం సొంత డబ్బులు ఖర్చు చేయడమో లేకపోతే అప్పు చేసి మరీ ఎక్కువ షోస్ టికెట్స్ కొనడమో చేస్తుంటారు. “హరిహర వీరమల్లు” సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే హడావుడిలో ఉన్నారు. సినిమా ఏకంగా 5 ఏళ్లు షూటింగ్ జరుపుకోవడం, రేపు విడుదలవుతున్నా గురువారం మినహా వీకెండ్ బుకింగ్స్ సరిగా లేకపోవడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద టెన్షన్ గా మారింది.
సినిమా మీద బజ్ లేకపోవడం ఒకరకంగా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఆడియన్స్ కూడా ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసి ఏమాత్రం బాగున్నా ఆనందంగా థియేటర్ నుంచి బయటికి వెళ్తారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం వీకెండ్ బుకింగ్స్ ని ఫుల్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం బుకింగ్స్ లో ఏ యాప్స్ లోనూ గ్రీన్ అనేది కనిపించకుండా ఉండడానికి తెగ ఆరాటపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాకి ఇలాంటి బజ్ అనేది తొలిసారి కావొచ్చు. అయితే.. ట్రైలర్ కాస్తంత ఆసక్తికరంగా ఉండడంతో కనీసస్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే వీకెండ్ బుకింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది రాత్రి షోకి వచ్చే రెస్పాన్స్ బట్టి ఉంటుంది. మరి ఆ రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రెజర్ తగ్గేలా ఉంటుందా? లేక పెంచేలా ఉంటుందా? అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఆల్రెడీ కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి,.. ఇంకా మల్టీప్లెక్స్ షోస్ లో బుకింగ్స్ ఓపెనింగ్ అవ్వాల్సి ఉంది.