Hari Hara Veera Mallu Twitter Review: హరిహర వీరమల్లు తో పవన్ కళ్యాణ్ హిట్టు కొట్టినట్టేనా..!

[Click Here For Detailed Review]

 

‘గేమ్ ఛేంజర్’ తర్వాత పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ క్రమంలో అందరి దృష్టి ‘హరిహర వీరమల్లు’ పై పడింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అలాగే ఆయన 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా.. అందువల్ల ఈ సినిమా వాళ్లకి చాలా ప్రత్యేకం కానుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో స్ట్రైట్ మూవీ చేసింది లేదు అనే విమర్శలు వచ్చాయి. దానికి సమాధానంగా కూడా ‘హరిహర వీరమల్లు’ గురించి చెప్పాడు పవన్ కళ్యాణ్.

Hari Hara Veera Mallu Review

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశాడు. ఆల్రెడీ ప్రీమియర్స్ వేశారు. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. 20 నిమిషాలకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ వచ్చిందట. అప్పటివరకు కథలోకి ఆడియన్స్ ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారని అంటున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ , నిధి అగర్వాల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వచ్చాయట. అలాగే సుబ్బరాజు, సునీల్ వంటి వాళ్ళ కామెడీ సన్నివేశాలు వచ్చాయి అంటున్నారు.

తార తార సాంగ్ కలర్ఫుల్ గా పిక్చరైజ్ చేశారని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ బాగా వచ్చిందట. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో ఇంటర్వెల్ బ్లాక్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని.. క్లైమాక్స్ లో వచ్చే వార్ ఎపిసోడ్ అలరించిందని అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

[Click Here For Detailed Review]

 

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus