Prince Movie: ‘ప్రిన్స్’ మూవీ థియేట్రికల్(తెలుగు) బిజినెస్ డీటెయిల్స్..!

‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్నాడు శివ కార్తికేయన్. అతను ఈసారి ఓ తెలుగు దర్శకుడితో సినిమా చేశాడు. అదే ‘ప్రిన్స్’ సినిమా.’జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి ఈ చిత్రానికి దర్శకుడు.తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 21న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’, ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘శాంతి టాకీస్’ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగులో ఈ చిత్రానికి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 1.70 cr
సీడెడ్ 1.00 cr
ఉత్తరాంధ్ర 0.95 cr
ఈస్ట్+వెస్ట్ 0.50 cr
కృష్ణా + గుంటూరు 0.65 cr
నెల్లూరు 0.18 cr
ఏపి+ తెలంగాణ 4.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్)+
ఓవర్సీస్(తెలుగు వెర్షన్)
0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.23 cr (షేర్)

‘ప్రిన్స్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవడానికి రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘సర్దార్’ ‘ఓరి దేవుడా’ ‘జిన్నా’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ‘కాంతారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

కాబట్టి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి. ఈ చిత్రం కనుక హిట్ అయితే శివ కార్తికేయన్ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తాడు అలాగే తెలుగులో అతని మార్కెట్ బలపడే అవకాశాలు ఉన్నాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus