Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం కెప్టెన్ గా యావర్..! ఎలా కెప్టెన్ అయ్యాడంటే.?

బిగ్ బాస్ హౌస్ లో రెండో కెప్టెన్ గా ఆరోవారం టాస్క్ లో విజయం సాధించిన యావర్ అయ్యాడు. పవర్ అస్త్రా కోసం యావర్ ఎంతో కృషి చేశాడు. ఎన్నోసార్లు వచ్చినట్లే వచ్చి అది చేజారిపోయింది. దీంతో కసిగా మళ్లీ మళ్లీ ఆడదాం అంటూ తనని తాను మోటివేట్ చేసుకుంటూ యావర్ గేమ్ ఆడాడు. ఫస్ట్ వీక్ నుంచీ ప్రిన్స్ యావర్ కేవలం తన గేమ్ తోనే ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఎలిమినేషన్ డేంజర్ జోన్ నుంచీ టాప్ ఓటింగ్ వచ్చేవరకూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు.

అలాంటింది ఇప్పుడు యావర్ కెప్టెన్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే యావర్ ఎలా కెప్టెన్ అయ్యాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు టాస్క్ లో ఆటగాళ్లు విజయం సాధించారు. దీంతో వాళ్లందరూ కూడా కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. ఇందులో బెలూన్ టాస్క్ వచ్చింది. ఈ బెలూన్ టాస్క్ లో యావర్ లాస్ట్ వరకూ ఉండి గెలిచి బిగ్ బాస్ హౌస్ కి (Bigg Boss 7 Telugu) రెండో కెప్టెన్ అయ్యాడు.

ఇక కెప్టెన్ అయిన తర్వాత ప్రిన్స్ యావర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతవారం పల్లవి ప్రశాంత్ కూడా కలర్ గేమ్ లో ఆడి లాస్ట్ వరకూ ఉండి కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ప్రిన్స్ యావర్ కూడా లాస్ట్ వరకూ ఉండి రెండో ఇంటి కెప్టెన్ అయ్యాడు. దీంతో శివాజీ సపోర్ట్ తోనే వీళ్లిద్దరూ కెప్టెన్స్ అయ్యారంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ నుంచీ కూడా శివాజీ వీరిద్దరికే హౌస్ లో మద్దతు ఇస్తూ వచ్చాడు.

వాళ్లు చాలా కష్టపడి గేమ్ ఆడుతున్నారని పదే పదే చెప్తూ వచ్చాడు. అంతేకాకుండా టాస్క్ లలో ప్రిన్స్ యావర్ తన 100శాతం ఎఫోర్ట్స్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్ అయ్యాడు. మొత్తానికి ఈవారం ఎవిక్షన్ ఫ్రీతో పాటుగా, వచ్చేవారం తనకి కెప్టెన్ గా ఇమ్యూనిటీ కూడా వచ్చింది. అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus