చిరంజీవితో (Chiranjeevi) కలసి పని చేసే అవకాశం వస్తే ఎవరైనా నో చెబుతారా? ప్రశ్నకు కచ్చితంగా ‘నో’ అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఆయనతో సినిమా చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఓ నటుడు / దర్శకుడు మాత్రం రెండు సార్లు ఛాన్స్ వచ్చినా చేయలేదు. అయితే ఆయన అలా చేయకపోవడానికి కారణం వింటే… ఓ సినిమా విషయంలో ఇంత ప్రేమ చూపిస్తారా? ఓ సినిమా కోసం ఇంత చేస్తారా? అని అనిపిస్తుంది.
అదేంటి రెండు సార్లు ఛాన్స్ వదులుకోవడం సినిమా మీద ప్రేమ చూపించడమా అంటారా? ఆయన ఆ రెండుసార్లూ వదులుకోవడానికి కారణం ఇంకో గొప్ప సినిమ కాబట్టి. చిరంజీవితో కలసి పని చేసే ఛాన్స్ వదులుకున్న వ్యక్తి మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాగా, ఆ రెండు ఛాన్స్‌లు ‘సైరా’(Sye Raa), ‘గాడ్ ఫాదర్’(God Father). ఇక ఆయన వదులుకోవడానికి కారణమైన సినిమా ‘ది గోట్ లైఫ్’ / ‘ఆడు జీవితం’ (The Goat Life). ఈ సినిమా ప్రచారంలో భాగంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ విషయాన్ని చెప్పారు.
సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ‘ఆడు జీవితం’ సినిమా మార్చి 28న థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో మీడియాతో పృథ్వీ రాజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ది గోట్ లైఫ్’ సినిమా వల్ల చిరంజీవి రెండు ఆఫర్లను తిరస్కరించాల్సి వచ్చిందని చెప్పిన పృథ్వీరాజ్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆ సినిమా షూటింగ్ జరుపుకున్న సంగతి చెప్పారు. 2017లో చిరంజీవి తన హిస్టారికల్ సినిమా ‘సైరా నరసింహరెడ్డి’లో ఓ కీలక పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించారు. అప్పుడు ‘ది గోట్ లైఫ్’ గురించి చెప్పి నో చెప్పారు.
ఆ తర్వాత మరోసారి ‘లూసిఫర్’ రీమేక్‌ను డైరెక్ట్ చేయమని చిరు అడిగారు. అప్పటికి ఈ సినిమా పని అవ్వకపోవడంతో మళ్లీ నో చెప్పారట. 1990లో జీవనోపాధి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి జీవిత కథగా ఆధారంగా ‘ఆడు జీవితం’ సినిమాను రూపొందించారు. ఏడారి దేశానికి వలస వెళ్లిన ఆ కుర్రాడు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడనే అంశం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. పాస్ పోర్టులు లాక్కోవటం, బానిసలుగా మార్చుకోవటం, ఇమిగ్రేషన్ కష్టాలు, ఎడారిలో బతుకు లాంటి ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉంటాయట.