Priyamani: ‘ఆర్టికల్‌ 370’ సినిమాపై ప్రియమణి ఆసక్తికర కామెంట్స్‌… చూశారా?

ప్రియమణిని చూస్తే… సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంటే ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది. వరుస సినిమాలు చేసి, ఆ తర్వాత కాస్త స్లో అయిన ఆమె కెరీర్‌ ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌లో నడుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలు వరుస పెట్టి చేసేస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘ఆర్టికల్‌ 370’ సినిమా విడుదలైంది. ఆదిత్య సుహాస్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో యామీ గౌతమ్‌తోపాటు ప్రధాన పాత్ర పోషించింది ప్రియమణి. సంచలనాలు, వివాదాలకు కేంద్రబిందువులా ‘ఆర్టికల్‌ 370’ సినిమాలో ప్రియమణి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

‘ఆర్టికల్‌ 370’ని కొందరు రాజకీయ ప్రచారం కోసం చేసి సినిమా అంటున్నారు కానీ… ఇది జనాల్లో చైతన్యం కోపసం చేసిన చిత్రం అని ఆమె చెప్పారు. ఈ సినిమా వాస్తవిక సంఘటనల ఆధారంగానే తెరకెక్కిందని, ఆర్టికల్‌ 370 వెనక ఉన్న చరిత్ర, వాస్తవాలు, జరిగిన చూపించే ప్రయత్నం ఈ సినిమా అని చెప్పింది. ఈ సినిమా ఓకే చేసేటప్పటికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 గురించి ఏంటో తెలియదట. కథలోని సున్నితమైన అంశాల విషయంలో తనకు పెద్దగా అవగాహన లేదట.

సినిమా చేస్తుండగా ఆ విషయాలన్నీ తెలిశాయి అని చెప్పింది ప్రియమణి. ఈ సినిమాలో ఆమె ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేసే రాజేశ్వరి స్వామినాథన్‌ అనే ఓ కీలక ఐఏఎస్‌ అధికారిణిలా కనిపిస్తుంది. 370 ఆర్టికల్‌ రద్దు సమయంలో జరిగిన విషయాల్ని సినిమాలో చూపించాం అని అంటోంది. ఇక ప్రియమణి సంగతి చూస్తే… ఇటీవల ‘భామాకలాపం 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇప్పుడు ఆమె (Priyamani) చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హిందీలో అజయ్‌ దేవగణ్‌ ‘మైదాన్‌’లో ఇప్పటికే నటించేసింది. ఇది కాకుండా తమిళంలో ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ అనే సినిమా చేస్తోంది. కన్నడలో ‘ఖైమారా’ అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని చెబుతున్నారు. త్వరలో వాటి విషయంలో క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus