Priyamani: దక్షిణాది నటులకేం తక్కువ.. ప్రియమణి కామెంట్స్ వైరల్!

సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సెకండ్ ఇన్నింగ్స్ లో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించడం సులువైన విషయం కాదు. అయితే ప్రియమణి (Priyamani) మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ సినిమాలలో సైతం ఆఫర్లను సొంతం చేసుకుంటూ ప్రియమణి ప్రశంసలను అందుకున్నారు. ప్రియమణి రెమ్యునరేషన్ భారీ రేంజ్ లోనే ఉంది. ప్రియమణి తాజాగా మాట్లాడుతూ ప్రస్తుతం సౌత్ నటులు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నారని తెలిపారు.

సౌత్ ఇండియాకు సంబంధించిన రోల్ కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నామని కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లు కామెంట్ చేస్తున్నారని ప్రియమణి పేర్కొన్నారు. త్వరలో ఈ ధోరణిలో కూడా మార్పు రావాలని అనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మేము సౌత్ వాళ్లమే అయినా హిందీ అనర్గళంగా మాట్లాడగలమని ప్రియమణి కామెంట్లు చేశారు. మేము అందంగా కూడా ఉంటామని కాకపోతే మా రంగు నార్త్ వాళ్లంత ఫెయిర్ గా ఉండదని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే అది పెద్ద విషయం కాదని ఆమె తెలిపారు. సౌత్ నుంచి వచ్చే నటీనటులకు అన్ని భాషలపై అవగాహన ఉంటుందని ప్రియమణి తెలిపారు. డైలాగ్స్ చెప్పే సమయంలో గ్రామర్ తప్పులు ఉన్నా ఎమోషన్స్ ను సరిగ్గా పండిస్తామని ప్రియమణి వెల్లడించడం గమనార్హం. సౌత్, నార్త్ అన్న వ్యత్యాసం చూడకూడదని అందరూ భారతీయ నటీనటులే అని ప్రియమణి వెల్లడించారు. ప్రియమణి మైదాన్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించగా ఈ ఏడాది ఏప్రిల్ నెల 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది.

జీ స్టూడియోస్, బోనీ కపూర్ (Boney Kapoor) మైదాన్ (Maidaan) సినిమాను సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో ప్రియమణి బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అజయ్ దేవగణ్ (Ajay Devgn)  మైదాన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ప్రియమణిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా తెలుగులో సైతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆమె బిజీ అవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus