Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో కాళ్లు పట్టుకున్న అశ్విని…! అసలు కారణాలు ఏంటో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ తో హౌస్ హీటెక్కిపోయింది. బిగ్ బాస్ రాజ్యంలో రాజమాతలు – ప్రజల నామినేషన్స్ ని స్వీకరించి ఒకరిని నామినేట్ చేయాలి. హౌస్ లో మిగిలిన నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ రాజమాతలుగా మారారు. దీంతో ప్రజలు ఇద్దరు చొప్పున వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేరు చెప్పి నామినేట్ చేయడం ప్రారంభించారు. ఇక్కడే ప్రియాంక ఇంకా అశ్వినికి మాటల యుద్దం జరిగింది. భోలే షవాలి అమర్ ని నామినేట్ చేస్తుంటే, భోలే చెప్పిన పాయింట్ కి ప్రియాంక అబ్జక్ట్ చేసింది. దానికి భోలే మీరు ఇక్కడ మేనేజ్ చేయద్దు అన్నాడు.

దీంతో ప్రియాంకకి బాగా మండింది. ఇద్దరికీ మాటకి మాట పెరిగింది. మద్యలో అశ్విని అలాకాదు ఆయన అన్నది వదిలేయ్ అని సర్దిచెప్పబోతుంటే నువ్వు ఆగు అశ్విని అంటూ మాట్లాడింది ప్రియాంక. అలాగే, భోలే తనని – అమర్ ని బడ్డీస్ అంటూ మాట్లాడుతూ రెచ్చగొట్టాడు. దీంతో ప్రియాంక భోలేపా అరుస్తూ ఆర్గ్యూమెంట్ చేసింది. ఇక్కడే అశ్విని నేను నీలాగా మాట్లాడలేనమ్మా అన్నది. దీనికి నాలాగా మాట్లాడే అవసరం నీకు రాదు అంది ప్రియాంక. అలాగే నాలాగా మాట్లాడటం నువ్వు నేర్చుకోలేవ్. నువ్వు నేర్చుకోలేవ్ అంటూ అరిచింది. దీంతో అశ్విని బాగా ఫీల్ అయ్యింది.

దీని తర్వాత నామినేషన్స్ పైనల్ చేసేటపుడు అశ్విని ఏంటి నేను నీలాగా మాట్లాడలేనా అంటూ ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. దీంతో శోభా ఇన్వాల్ అయ్యింది. ఇట్స్ నాట్ కరెక్ట్ అశ్విని నామినేషన్స్ లో ఇలా నువ్వు ప్రతిదానికి ఫైర్ అవ్వడం అనేది కరెక్ట్ గా లేదు అంటూ గట్టిగా నిలదీసింది. అంటే నువ్వు గ్రేట్ ఇక్కడ కూర్చున్న వాళ్లందరూ వేస్ట్ అని చెప్తున్నావ్ అంతేనా అని అడిగింది అశ్విని. అది ఎవరు చెప్పారు. నీ నోటీతో నువ్వే అంటున్నావ్, అనుకుంటున్నావ్ అంటూ అశ్వినిని ఇద్దరూ కలిసి దబాయించారు.

ఇద్దరూ కలిసి గట్టిగాట్టిగా మాట్లాడుతుంటే, అశ్విని భోరున ఏడ్చేసింది. దీంతో శోభా శెట్టి నువ్వు బ్యాడ్ చేయాలని అనుకుంటే కెమెరా ముందుకు వెళ్లి చేసేయ్ అంటూ చెప్పింది. ప్రియాంక కూడా అశ్వినితో ఆర్గ్యూమెంట్ గట్టిగానే పెట్టుకుంది. ఒక్కసారిగా బరెస్ట్ అయిన అశ్విని, అమ్మా తల్లీ నీకాళ్లు పట్టుకుంటానమ్మా.. వదిలే్య్ అంటూ ఎమోషనల్ అయిపోయింది. నిజానికి అశ్వినికి గతవారమే వీళ్లంటే పడలేదు. టాస్క్ లో ఆడేటపుడు, బాల్స్ కలెక్ట్ చేసేటపుడు కూడా ఆర్గ్యమెంట్స్ అయ్యాయి. ఆ ఫ్రస్టేషన్ మనసులో ఉంది. అలాగే భోలే షవాలితో వీళ్లు పెద్ద ఐఎయస్ అనే ఫీలింగ్ ఇస్తున్నారు.

అప్పటికి మనం ఏదో ఎల్ కేజీ అన్నట్లుగా అంటూ మాట్లాడింది. అలాగే, ఈనాకొడుకులు అని కూడా అన్నది. అసలు టెన్త్ క్లాస్ పాసయ్యారో లెదో అనే కామెంట్స్ కూడా చేసింది. శోబాశెట్టి గొంతు వింటనే అశ్విని గొంతులో వణుకు వచ్చేస్తోంది. లాస్ట్ టైమ్ కూడా ఇదే విషయాన్ని తను స్వయంగా చెప్పింది. ఫస్ట్ నామినేషన్ అప్పుడు అయితే ఏడ్చేసింది. అశ్విని బయట ఐదువారాలు షోని బాగా పర్యవేక్షించాక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సీరియల్ బ్యాచ్ ని టార్గెట్ చేసింది. మొదటి ఐదువారాలు సీరియల్ బ్యాచ్ సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీని మూట గట్టుకున్నారు.

దాంతో వాళ్లని టార్గెట్ చేస్తే తన ఆట ఈజీ అయిపోతుంది. ఇక్కడే మేటర్ ఏంటంటే, (Bigg Boss 7 Telugu) హౌస్ లో ఉన్న వాళ్లకి కూడా తెలుసు బయట ఎలా ప్రేక్షకులకి పోట్రే అవుతోందనేది. అందుకే, ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లాయి. ఇక బయట ఉన్న మేల్ కంటెస్టెంట్స్ ఈ గొడవని బాగా ఎంజాయ్ చేశారు. ఏంటి ముఖాలు మాడిపోయినాయ్ అని కామెంట్ కూడా చేశారు. నామినేషన్ ప్రోసెస్ అయిన తర్వాత ఈవిషయంలో క్లారిటీ తీస్కుందాం అని కెప్టెన్ శోబాశెట్టి అడిగితే ఇప్పుడు నేను సెట్ అయిపోయాలే వదిలేయ్ అంటూ సమాధానం ఇచ్చింది. మొత్తానికి అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus