Bigg Boss 7 Telugu: ప్రియాంక – శోభా దగ్గర అడ్డంగా దొరికిపోయిన రతిక..! నామినేషన్స్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో రతిక నామినేషన్స్ చాలా అతిగా మారాయి. హౌస్ మేట్స్ అందరూ నిరుత్సాహంతో నిస్సహాయంగా, దీనంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పిందే, చెప్పి తిప్పి తిప్పి అక్కడికే వచ్చి మళ్లీ అదే పాయింట్ మాట్లాడింది రతిక. ఫస్ట్ తను నామినేట్ చేస్తూ ప్రియాంకని ఇంకా శోభాని ఫౌల్ గేమ్ ఆడారని చెప్పింది. సింక్ అండ్ ఫ్లో టాస్క్ లో అమర్ కి హెల్ప్ చేస్తామని చెప్పారని, ఈవిషయం సంచాలక్ కి చెప్పాలి కదా అని నిలదీసింది. నిజానికి ఈ హింట్ నాగార్జున హోస్టింగ్ లో శనివారం వచ్చింది.

అంతేకాదు, వాళ్ల ముగ్గురూ గుసగుసలు ఆడుకుంటున్నట్లుగా చూపించాడు బిగ్ బాస్. ఈ పాయింట్ పట్టుకుంది రతిక. కానీ, మద్యలో శోభా అమర్ ని స్ట్రయిట్ గా ఒక పాయింట్ అడిగింది. దీంతో రతిక అడ్డంగా బుక్కైయ్యింది. అమర్ నీకు రతిక హెల్ప్ చేసిందా లేదా చెప్పు అంటూ అడిగింది శోభా. చేసిందని చెప్పాడు. ఏదైతే పాయింట్ పైన నామినేట్ చేస్తోందో, అదే పని రతిక చేసింది కాబట్టి అడ్డంగా వాళ్లకి దొరికిపోయింది. దీంతో శోభా, ప్రియాంక ఇద్దరూ కూడా రతికతో ఆడుకున్నారు. అంతేకాదు, తిప్పి తిప్పి అదే పాయింట్ చెప్తున్నా బాగా డిపెండ్ చేసుకున్నారు.

ఇక ప్రియాంక , శోభ ఇద్దరూ కూడా రతికనే నామినేట్ చేశారు. అలాగే, టేస్టీ తేజ కూడా రతిక గేమ్ గురించి మాట్లాడుతూ, ఫస్ట్ 2వారాలు గేమ్ ఆడిన రతిక కావాలని బాగా డల్ అయ్యావని అన్నాడు. యాక్టివ్ గా గేమ్ లో పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పాడు. దీనికి రతిక నేను ఆడుతున్నానని నీకే కనిపించడం లేదని చెప్పింది. కానీ, నాగార్జున ముందు వీకెండ్ ఆటలేదని నువ్వే చెప్పావని అందుకే ఈవారం ఆడమని నామినేట్ చేస్తున్నా అని క్లియర్ గా చెప్పాడు తేజ. తేజకి రతిక ఇద్దరికీ పెద్ద వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ చాలాసేపు ఈ పాయింట్ పైన వాదించుకున్నారు.

మద్యలో తేజ ప్రియాంక ఇష్యూని తీస్కుని వస్తే, రతిక అర్జున్ విషయంలో ఎందుకు మార్చుకుంటాను అన్నావ్ ఇప్పుడు మార్చుకో అంంటూ రతిక అతిగా ప్రవర్తించింది. దీంతో హౌస్ మేట్స్ కి నీరసం వచ్చింది. ఎక్కడి వాళ్లు అక్కడ కూర్చుండిపోయారు. ఎప్పుడెప్పుడు వీళ్ల ఆర్గ్యూమెంట్ అవుతుందా అని వెయిట్ చేశారు. దీంతో 9వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా అయ్యాయి. హౌస్ మేట్స్ అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతూ ఎక్కడా ఎవరూ హర్ట్ అవ్వకుండా నామినేట్ చేయాలని చూశారు. హౌస్ లో 9 వారాలు గడుస్తున్నా కూడా ఇంకా చాలామంది నామినేషన్స్ లో సేఫ్ గా ఆడుతున్నారు. అదీ మేటర్.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus