16 ఏళ్ళ వయసులో ప్రియాంకా చోప్రా ఎలా ఉండేదో చూడండి..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా సర్జరీలు చేయించుకున్న మాట నిజమేనా? అనే డౌట్ ఇప్పుడు చాలా మంది ప్రేక్షకుల్లో మెదులుతుంది. గతంలో ఈమె పై ఎన్నో విమర్శలు…!’సర్జరీలు చేయించుకుని షేపులు మార్చుకున్న మాజీ విశ్వ సుందరి’ అంటూ అప్పట్లో చాలా పత్రికలు రాసుకొచ్చాయట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే చెప్పుకొచ్చింది.ఇటీవల ఆమె ఆటోబయోగ్రఫీతో ‘అన్ ఫినిష్డ్’ అనే బుక్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కలతలు, అవమానాలు, లైంగిక వేధింపులు, వంటివి ఆ పుస్తకంలో వివరించింది.

ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా ఎదిగిన ప్రియాంకా చోప్రా జీవితం సాఫీగా సాగింది ఏమి కాదు. ఇదిలా ఉండగా.. 16 ఏళ్ళ వయసులో ప్రియాంక చోప్రా ఎలా ఉండేది? అని తెలుసుకోవాలి అని ప్రతీ ఒక్కరికీ ఉండే ఉంటుంది.బహుశా వాళ్ళ కోసమే అనుకుంట.. ఇదిగో ఈ త్రో బ్యాక్ పిక్ ను షేర్ చేసింది పిసి. ఈ ఫొటో చూస్తుంటే.. నిజంగా ఈమె మన విశ్వ సుందరి ప్రియాంకేనా? అనే అనుమానం కలుగక మానదు.

ఎందుకంటే ఈమె మొహం అప్పటికీ ఇప్పటికీ కొంచెం కూడా సంబంధం లేదు. హాట్ నెస్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ తగ్గలేదు అనుకోండి. 35 సంవత్సరాలకు నిక్ జోనస్ ను వివాహం చేసుకుని గ్లోబల్ బ్యూటీగా ఎదిగిన ప్రియాంకా 18 ఏళ్లకు మిస్ వరల్డ్ కిరీటాన్ని సంపాదించుకుంది. ఆ ప్రయాణాన్ని ఈ ఒక్క ఫొటోతో వివరించింది పిసి.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus