టీషర్ట్ తెచ్చిన తంటాలు!

ఇప్పటివరకూ ఏ సెలబ్రిటీకి అయినా మహా అయితే.. నోరు జారడం వలన ఇబ్బందులు వచ్చి ఉంటాయి, లేక ఏదైనా సినిమాలో ఇబ్బందికరమైన సన్నివేశంలో నటించి ఉంటే సమస్యలు తలెత్తి ఉంటాయి. కానీ.. మొట్టమొదటిసారిగా ఓ హీరోయిన్ కి స్లీవ్ లెస్ టీషర్డ్ వేసుకొన్నందుకు కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే.. ఆ కష్టాలు ఆ స్లీవ్ లెస్ కారణంగా కాదండోయ్, ఆ టీషర్ట్ మీద ఉన్న కొటేషన్ వల్ల. ఏంటా కొటేషన్, ఎవరా హీరోయిన్, ఏమా కథ అనేది పూర్తిగా తెలుసుకొందాం.

ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస చిత్రాలు సైన్ చేస్తూ యమబిజీగా మారిపోయిన్ బాలీవుడ్ కథానాయిక ప్రియాంక ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయించుకొంది. ఎప్పట్లాగే హాట్ ఫోజులతో, స్టీమీ ఎక్స్ ప్రెషన్స్ తో ఫోటోలు దిగింది. అయితే.. సదరు మ్యాగజైన్ వారు అమ్మడి ఫోటోతో ప్రచురించిన సంచిక ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సదరు ఫోటోలో ప్రియాంకా రెఫ్యూజీ, ఇమ్మిగ్రంట్, అవుట్ సైడర్, ట్రావెలర్ అనే పదాలున్న టీ షార్ట్ ను ధరించింది. అయితే మొదటి మూడు పదాలను కొట్టేసి కేవలం ట్రావెలర్ అనే పదాన్ని మాత్రమే ఆ టీషర్ట్ పై కొట్టేయకుండా ఉంచారు.

ఇప్పుడా విషయాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆ ఫోటోను బట్టి ప్రియాంకను హాలీవుడ్ ఇంకా ట్రావెలర్ గానే ట్రీట్ చేస్తోందని కొందరు వ్యాఖ్యానించారు. కొంతమంది మాత్రం ఇదంతా ఆ మ్యాగజైన్ వారు వాళ్ళ ప్రమోషన్స్ కోసమే చేస్తున్నారని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఈ విషయం కారణంగా ప్రియాంకకు విశేషమైన పబ్లిసిటీ లభిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus