Bigg Boss 7 Telugu: భోళే షవాలి మాటలకి హర్ట్ అయిన ప్రియాంక..! అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎమోషన్స్ తో ఆట. ముఖ్యంగా ఒకరిపై ఒకరు మాటలు అంటుంటే తీస్కోలేరు. అంతేకాదు, నామినేషన్స్ అప్పుడు మనల్ని నామినేట్ చేస్తున్నా, వేరేవాళ్లు మనలోని లోపాలని ఎత్తి చూపిస్తున్నా కూడా మనం తట్టుకోలేం. ఇక వంటింట్లో అయితే ప్రతిరోజూ వంట బదులు తంటాలే ఉంటాయి. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువగా కిచెన్ లో గొడవ పడుతుంటారు. అంతేకాదు, ఫుడ్ విషయంలో కూడా కావాలనే బిగ్ బాస ఫిట్టింగ్ పెడతాడు. లగ్జరీ బడ్జెట్ కూడా కొంతమందికే ఇస్తుంటాడు.

ఇక హౌస్ లో (Bigg Boss 7 Telugu) గత రెండురోజులుగా కిచెన్ లో ప్రియాంక ఫ్రస్టేట్ అవుతూనే ఉంది. భోళే షవాలి వచ్చి అన్నింటిలోనూ తలదూరుస్తున్నాడని, వద్దు అని చెప్పినా కూడా వండుతున్నాడని కంప్లైట్స్ ఇచ్చింది. దీనివల్ల ప్రశాంత్ కెప్టెన్సీ కూడా పోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ మరోసారి సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. అయినా కూడా కిచెన్ డ్యూటీస్ వేయడంలో ప్రశాంత్ ఫైయిల్ అయ్యాడు. భోలే షవాలి వచ్చి ఏదో ఒక రూపంలో మాటలు అంటున్నాడని, అది నేను తీస్కోలేకపోతున్నానని ప్రియాంక ఫుల్ గా బరెస్ట్ అయిపోయింది.

ఇంట్లో వంట చేసి పెట్టింది కాకుండా ఇలా మాటలు పడలా ? నాకు ఏమీ అవసరం లేదని, నేను అలసిపోయానని నేను చేయలేకపోతున్నానని ఏడ్చేసింది. దీంతో హౌస్ మేట్స్ అయిన శోభా, సందీప్, అమర్ , గౌతమ్ ప్రియాంకని ఓదార్చే ప్రయత్నం చేశారు. నిజానికి రెండు రోజులు క్రితమే భోళే షవాలి కిచెన్ లో టమాట రైస్ చేస్తుంటే వద్దని ప్రియాంక చెప్పింది. అయినా కూడా వినకుండా భోళే టమాట రైస్ చేశాడు.

దీనికి కిచెన్ నాకు వద్దని దూరంగా ఉంది ప్రియాంక. ఆ తర్వాత బిగ్ బాస్ ఆర్డర్స్ పై గౌతమ్ ప్రియాంకకి యాప్రాన్ వేసి కిచెన్ బాధ్యతలు ఇచ్చాడు. తోడుగా సందీప్ మాస్టర్, తేజ కూడా ఉన్నారు. కానీ భేళే ఇలా అస్తమానం కిచెన్ లోకి రావడం అనేది ప్రియాంకకి నచ్చడం లేదు. ఇక తనని అన్న మాటలు తీస్కోలేకపోతున్నానని బరెస్ట్ అయ్యింది. బాగా ఎమోషనల్ అయ్యింది. అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus