గాయని మనోభావాలు ప్రియాంకకే తెలుసట..!

తన ప్రతిభతో బాలీవుడ్ బోర్డర్ దాటి హాలీవుడ్ వరకు చేరుకుంది అందాల సుందరి ప్రియాంక చోప్రా. గాయనిగాను ఆల్బమ్స్ చేస్తూ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకుంది. ఇలా మల్టీ టాలెంటెడ్ గా పేరున్న ప్రియాంక తన బయోపిక్ లో నటిస్తే బాగుంటుందని ప్రముఖ గాయని ఆశాభోంస్లే అభిప్రాయపడ్డారు.

బాలీవుడ్ లో బయోపిక్ లకు ఏ స్థాయిలో ఆదరణ లభిస్తున్నది చూస్తూనే ఉన్నాం. తన 83వ జన్మదిన వేడుకలలో భాగంగా “మీ జీవిత కథతో సినిమా చేస్తే అందులో ఎవరు నటించాలని కోరుకుంటున్నారు” అన్న ప్రశ్నకు ఆశాభోంస్లే పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రియాంక కూడా పాడుతుంది గనక గాయని మనోభావాలు తనకు బాగా తెలుస్తాయని కితాబిచ్చారు. దాంతోపాటు ప్రముఖ సంగీత దర్శకుడు, తన భర్త అయినా ఆర్ డి బర్మన్ బయోపిక్ చేస్తే మరింత సంతోషమని పేర్కొన్నారు. బాక్సర్ “మేరీకోమ్” కథతో తెరకెక్కిన సినిమాలో అతి కఠినమైన బాక్సర్ పాత్రని పోషించిన ఆశాభోంస్లే కోరిక తీరుస్తుందేమో చూడాలి. మరి దీనిపై బాలీవుడ్ దర్శకుల మాటేమిటో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus