Bigg Boss 5 Telugu: సన్నీ విషయంలో కాజల్ కావాలనే అలా చేస్తోందా ?

బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఫైర్ ఇంజన్ ట్రక్ అలారమ్ మోగినప్పుడల్లా ఇద్దరు హౌస్ మేట్స్ ఎక్కాలి. వారికి బర్నింగ్ హౌస్ లో కాలిపోతున్న ఇద్దరు హౌస్ మేట్స్ ఫోటోలు కనిపిస్తాయి. అందులో నుంచీ వారు ఏకాభిప్రాయంతో ఒక్కరిని మాత్రమే సేఫ్ చేయాలి. అందుకు తగిన కారణాలు సంచాలక్ అండ్ కెప్టెన్ అయిన మానస్ కి చెప్పి ఎవర్ని సేఫ్ చేస్తున్నారు ? ఎవర్ని బర్న్ చేస్తున్నారో హౌస్ మేట్స్ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ అలారమ్ రాగానే రవి ఇంకా షణ్ముక్ ఇద్దరూ ఫైర్ ట్రక్ లో కూర్చున్నారు. వారికి శ్రీరామ్ ఇంకా మానస్ ఫోటోలు కనిపించాయి. ఫస్ట్ షణ్ముక్ మానస్ శ్రీరామ్ కంటే వీక్ కాబట్టి మానస్ కి ఈ పాస్ ఇద్దామని రవికి చెప్పాడు.

కానీ, రవి టాస్క్ ల ప్రకారం , పెర్ఫామన్స్ ప్రకారం చూడాలని, వారికి మాత్రమే పాస్ ఇవ్వాలని శ్రీరామ్ ని సేఫ్ చేద్దామని చెప్పాడు. దీంతో చాలాసేపటికి కన్విన్స్ అయిన షణ్ముక్ శ్రీరామ్ ని సేఫ్ చేశాడు. మానస్ ని బర్న్ చేశారు. ఆ తర్వాత సన్నీ ఇంకా మానస్ ఇద్దరూ ట్రక్ ఎక్కినపుడు రవిని బర్న్ చేసి, అనీమాస్టర్ ని సేఫ్ చేశారు. తర్వాత షణ్ముక్ ఇంకా సిరి ట్రక్ ఎక్కే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక్కడ సన్నీ ఇంకా పింకీ ఫోటోలు వచ్చాయి. పీంకీని బర్న్ చేసి సన్నీని సేఫ్ చేశారు ఇద్దరూ. శ్రీరామ్ అండ్ అనీమాస్టర్ ట్రక్ ఎక్కినపుడు షణ్ముక్ ని బర్న్ చేసి సిరిని సేఫ్ చేశారు. ఇక్కడే సిరి ఇంకా షణ్ముక్ ఇద్దరూ కూడా మేము పబ్లిక్ ఓటింగ్ కి రెస్పక్ట్ ఇస్తామని, సేఫ్ అయినా ఎలిమినేట్ అయినా వాళ్ల చేతులమీదగా జరగాలని మాట్లాడారు.

తర్వాత కాజల్ అండ్ పింకీ ఇద్దరూ ట్రక్ ఎక్కినపుడు హై డ్రామా నడిచింది. ఇక్కడే సిరి ఇంకా శ్రీరామ్ ఫోటోలు వచ్చాయి. పింకీ శ్రీరామ్ ని సేవ్ చేద్దామంటే కాజల్ సిరిని సేఫ్ చేద్దామని చెప్పింది. ఇద్దరూ చాలాసేపు ఆర్గ్యూ చేస్కున్నారు. ఎవిక్షన్ పాస్ నాకు వద్దు అని సిరి అంటోంది కదా.. అలాంటపుడు ఎందుకు ఇవ్వాలి అంటూ పింకీ మాట్లాడింది. పింకీ ఈవిషయంలో సిరి మాటలు చాలా సీరియస్ గా తీస్కుంది. కానీ, జైల్లో నుంచీ నామినేషన్స్ అప్పుడు తనని సేఫ్ చేసిందని ఇప్పుడు పే బ్యాక్ టైమ్ అంటూ సిరిని కాపాడింది పింకీ. దీంతో వాళ్లిద్దరూ శ్రీరామ్ ని బర్న్ చేశారు. ఆ తర్వాత పింకీ ఇంకా అనీమాస్టర్ ఇద్దరూ ఏకాభిప్రాయంతో వెళ్లి సన్నీని సేఫ్ చేశారు. ఇక్కడే చాలాసేపు వీరిద్దరికీ ఆర్గ్యూమెంట్ జరిగింది. నిజానికి ఇద్దర్నీ బర్న్ చేసేద్దామని అనుకున్నారు.

ఒకవేళ ట్రక్ లో ఉన్న ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోతే బర్నింగ్ హౌస్ లో ఉన్న ఇద్దరూ కూడా తగలబడి పోతారు. ఆ అవకాశం ఉందని తెలిసిన అనీమాస్టర్ కాసేపు ఆ ఆలోచన కూడా చేసింది. కానీ, పింకీ అది ఫెయిర్ కాదని చెప్పి నేను మీ రూట్ లోకి వస్తానంటూ కాంప్రమైజ్ అయ్యింది. తర్వాత హై డ్రామా అనేది స్టార్ట్ అయ్యింది. మానస్ అండ్ పింకీ ఇద్దరూ వచ్చినపుడు అనీమాస్టర్ ఇంకా సిరి ఫోటోలు వచ్చాయి. ఇక్కడే హౌస్ మేట్స్ ప్లాన్స్ వేశారు. మానస్ అండ్ కాజల్ ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేదు. కాజల్ ఇద్దర్నీ బర్న్ చేస్తే సన్నీ కి ప్లస్ అవుతుందని సన్నీ మిగులుతాడు అంటూ లెక్కలు వేసింది. ఫస్ట్ తను సిరిని సేఫ్ చేద్దామంటే , మానస్ అనీమాస్టర్ ని సేఫ్ చేద్దామన్నాడు. ఇద్దరూ చాలాసేపు అక్కడ ఆర్గ్యూ చేస్కుంటున్నారు.

ఇక్కడ వాళ్ల ప్లాన్ తెలిసిన హౌస్ మేట్స్ అది ఫెయిర్ గేమ్ కాదంటూ మాట్లాడుకున్నారు. అనీమాస్టర్ కి కోపం వచ్చింది. అందుకే నేను ఇద్దరిదీ బర్న్ చేద్దామని చెప్తే పింకీ డ్రామాలు చేసిందంటూ మాట్లాడింది. యాక్టింగ్ నెంబర్ వన్ అంటూ మాట్లాడింది. దీంతో పింకీ ఫుల్ ఫైర్ అయ్యింది. ఎవర్ని అంటున్నారు అంటూ మాస్టర్ ని నిలదీసింది. ఇక్కడ కాజల్ కావాలనే మాటలు మారుస్తోందని కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరి ఫోటోలు బర్న్ చేసి సన్నీకి ఎవిక్షన్ పాస్ వచ్చేలా చేస్తోందని హౌస్ మేట్స్ అభిప్రాయ పడ్డారు. అదీ విషయం

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus