Balayya Babu: బాలయ్యతో పటాస్.. ఫ్యాన్స్ కు పండగే..?

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్త రాగానే బాలయ్య స్టైల్ లో అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తారా..? లేక అనిల్ రావిపూడి స్టైల్ లోకి బాలయ్య వస్తారా..? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య సినిమా గురించి, ఇతర సినిమాల గురించి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు సంబంధించి అనిల్ రావిపూడి స్పష్టతనిచ్చారు.

ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3 సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమా తరువాత బాలయ్య, మహేష్ తో తన సినిమాలు ఉంటాయని తెలిపారు. మహేష్ బాబుకు ఇప్పటికే కథ చెప్పానని మహేష్ కు చెప్పిన కథ నచ్చిందని.. బాలయ్య కోసం కథ తయారు చేశానని త్వరలోనే ఆయనకు చెబుతానని అనిల్ రావిపూడి అన్నారు. ఎఫ్3 సినిమా మరో యాభై రోజుల షూటింగ్ జరగాల్సి ఉందని ఆ సినిమా గురించి అనిల్ రావిపూడి వెల్లడించారు.

బాలయ్య సినిమాకు మంచి టైటిల్ కోసం వెతుకుతున్నానని టైటిల్ సిద్ధం కాగానే కథ చెబుతానని అనిల్ రావిపూడి తెలిపారు. బాలయ్య స్టైల్ లో తన సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. బాలయ్యతో పటాస్ తరహాలో యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతున్నానని అనిల్ రావిపూడి వెల్లడించారు. మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాకు మహేష్ నిర్ణయాన్ని బట్టి నిర్మాత ఫైనల్ అవుతారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. అనిల్ రావిపూడి కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే నవంబర్ లేదా డిసెంబర్ లో బాలయ్య అనిల్ రావిపూడి సినిమా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus