Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

మొన్నీమధ్య టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె జరిగిన విషయం తెలిసిందే. సుమారు మూడు వారాలపాటు షూటింగ్‌లు బంద్‌ చేసి కూర్చుకున్నారంతా. వేతనాలు పెంచాలంటూ కార్మికులు ఈ నిరసన చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రమేయంతో ఈ సమ్మె ముగిసింది. ఫలితాలు తర్వాత కార్మికులు అందాయి. అయితే అన్ని రోజులు షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇబ్బందిపడ్డ సినిమాల పరిస్థితి గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ టీమ్‌ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.

Mana ShankaraVaraprasad Garu

ఈ విషయాన్ని సినిమా నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి చెప్పుకొచ్చారు. సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగులు నిలిచిపోయినప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్‌ ముందు అనుకున్న షెడ్యూల్ రద్దయింది. దీంతో సంక్రాంతికి సినిమా అందుకుంటుందా లేదా అనే చర్చ ఆగింది. దీనిపై ఇప్పుడు స్వయంగా నిర్మాత సాహు గారపాటి క్లారిటీ ఇచ్చారు. సమ్మె కారణంగా తాము ఇబ్బందిపడ్డ మాట వాస్తవమే కానీ.. దానికి తగ్గట్టు ఇప్పడు ప్లాన్‌ చేసుకుంటున్నాం అని తెలిపారు.

సమ్మె కారణంగా మా సినిమా 15 రోజుల షూటింగ్ ఎఫెక్ట్ అయింది. ఈ సమయంలో ఆర్టిస్టులందరూ సహకరించారు. కొత్త షెడ్యూల్ కోసం డేట్స్‌ విషయంలో ముందుకొచ్చారు. ఇప్పుడు ఆ షెడ్యూల మొదలైంది కూడా. నవంబర్ 15కి సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్‌చేస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి వచ్చేస్తాం అని చెప్పారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌ కాగా వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను ముగించిన తర్వాత మరో 15 రోజుల పాటు సినిమా టీమ్‌ కీలక సభ్యుల డేట్స్‌ను తీసుకున్నారట అనిల్‌ రావిపూడి. తనదైన శైలిలో సినిమా ప్రచారం కోసం కొన్ని స్పెషల్‌ వీడియోలు చిత్రీకరిస్తారట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు మించి ప్రచార చిత్రాల్లో హంగులు, ఆర్బాటాలూ ఉండనున్నాయని టాక్‌. మరి చిరంజీవి ఈ ప్రచార చిత్రాల్లో ఎలా కనిపిస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం వెంకటేశ్‌ చాలా సరదా ఫీట్లు చేశారు మరి.

శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus