Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ విజయం పై నిర్మాత ధీమా..!

  • April 20, 2022 / 07:19 PM IST

‘మే 12న మేము ‘సర్కారు వారి పాట’ తో వస్తున్నాము. అది చాల చాల పెద్ద హిట్టు కొట్టినాక అంతే లెవెల్లో ఏమాత్రం తగ్గకుండా మా కంటిన్యుటీలో బ్యాక్ టు బ్యాక్ మా నాని గారి సినిమా ‘అంటే సుందరానికి’ కూడా అంతే లెవెల్లో కొడుతుంది అనేది బలంగా నమ్ముతున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ గారు. మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

Click Here To Watch NOW

ఆల్రెడీ ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి అంచనాలను పెంచింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ‘కళావతి’ ‘పెన్నీ’ రెండు కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. రెండేళ్ళ తర్వాత మహేష్ బాబు నుండీ రాబోతున్న చిత్రమిది. ఈ మూవీలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నాడు అనే కంటే ‘పోకిరి’ లో ఎలా కనిపించాడో అలా వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు అనడం బెటరేమో. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు అని స్పష్టమవుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా ఫారిన్ లొకేషన్స్ లో ఈ మూవీ ఉంటుందని సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుందని. అక్కడి జనాలకి మహేష్ బాబు ఎలా సాయం చేసాడు… అనే థీమ్ తో రూపొందినట్టు ఆల్రెడీ చాలా వార్తలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్, ఫన్.. సెకండ్ హాఫ్ లో వచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్ కూడా ఆకట్టుకుంటుందని వినికిడి. ఇక ఈ చిత్రం నుండీ 3వ పాటని అతి త్వరలో విడుదల చేయబోతున్నట్టు కూడా మేకర్స్ ప్రకటించారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus