Dil Raju: హీరో రాకేష్ వర్రె కామెంట్స్ పై దిల్ రాజు స్పందన!

ఈరోజు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  ‘క’ (KA)  సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ట్రైడెంట్ హోటల్లో ఈ ఈవెంట్ ను నిర్వహించారు. సక్సెస్ అనేది అందరి బంధువు. ఫెయిల్యూర్ అయితే అనాధ. కాబట్టి ఈ సక్సెస్ మీట్ కి దిల్ రాజు (Dil Raju) వంటి పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న హీరో రాకేష్ వర్రె (Rakesh Varre)  ‘జితేందర్ రెడ్డి’  (Jithender Reddy) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘చిన్న సినిమాల ప్రెస్ మీట్లకి సెలబ్రిటీలు రారు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

Dil Raju

ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. వీటిపై దిల్ రాజు (Dil Raju) స్పందించడం జరిగింది. దిల్ రాజు మాట్లాడుతూ.. “మొన్న ఒక వీడియో చూశాను. ఈవెంట్లకి సెలబ్రిటీలు రావడం లేదు అని అంటున్నారు. వాస్తవం ఏంటంటే.. ఇక్కడ మీ టాలెంట్ ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్వరూ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి రారు. కిరణ్ లో టాలెంట్ ఉంది. ఎక్కడో చిన్న పల్లెటూరి నుండి వచ్చి కష్టపడి సినిమాలు చేశాడు. ఈరోజు అతని సినిమా బాగుంది కాబట్టి..

జనాలు వచ్చి చూస్తున్నారు. మీ సినిమాని బట్టి థియేటర్లు దొరికాయి.. రెవెన్యూ వస్తుంది. అంతే తప్ప.. సెలబ్రిటీలు వచ్చినంత మాత్రాన ఏమీ అయిపోదు. మొన్న వీడియోలో మాట్లాడిన రాకేష్.., మీ సినిమాని మీరు బాగా ప్రమోట్ చేసుకోవాలి. సెలబ్రిటీలు ఎవ్వరూ రారు. ఎవ్వరికీ టైం ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళది. మీడియా వాళ్ళు అడుగుతారు.

సెలబ్రిటీలు రాలేదా అని? సెలబ్రిటీలు వస్తేనే వాళ్ళకి క్లిక్స్ వస్తాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి కుడా నా సలహా ఒక్కటే. హార్డ్ వర్క్ చేయగలము అంటే ఇక్కడికి రండి. నేను కుడా ఎక్కడో ఒక్క పల్లెటూరి నుండి వచ్చిన వాడినే..! హార్డ్ వర్క్ చేశాను..! ఇలా ఈరోజు మీ ముందు ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నటుడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus