ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నటుడు!

సినీ పరిశ్రమలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంది. నటీనటులు, దర్శకనిర్మాతలతో పాటు వివిధ క్రాఫ్ట్…లకు చెందిన ఫిలిం మేకర్స్ మరణిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సినీ నటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు మరణించారు. తాజాగా మరో యువ నటుడు మరణించడం అందరికీ షాక్ ఇచ్చింది. చిన్న వయసులోనే ఆ నటుడు మరణించినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. టెలివిజ‌న్ రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Nitin Chauhaan

ప్ర‌ముఖ బుల్లితెర న‌టుడు నితిన్ చౌహాన్ (Nitin Chauhaan) ఈరోజు కన్నుమూశాడు. ముంబైలోని అతని అపార్ట్‌మెంట్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. అతని వయసు కేవలం 35 ఏళ్ళు మాత్రమే.నితిన్ చౌహాన్ స్నేహితులు అయినటువంటి సుదీప్ సాహిర్, విభూతి ఠాకూర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘నితిన్ చనిపోయాడు’ అనే వార్తని తాము జీర్ణించుకోలేకపోతున్నారు అన్నట్టు వాళ్ళు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌ కి చెందిన నితిన్ చిన్నప్పటి నుండి సినిమాల‌పై మాకెక్కువతో ..

నటుడిగా మారాడు. ముంబై వచ్చి ‘దాదాగిరి 2’ అనే రియాలిటీ షో విజేత‌గా నిలిచి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ‘స్ప్లిట్స్ విల్లా 5’, ‘జిందగీ డాట్ కామ్’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి షోలలో కూడా ఇతనికి అవకాశాలు వచ్చాయి. ‘తేరా యార్ హూన్ మైన్’ నితిన్ చేసిన చివరి షో. ఇక నితిన్ చౌహాన్ మరణవార్తతో హిందీ చలన చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు బుల్లితెర నటీనటులు కామెంట్లు చేస్తున్నారు.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus