మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో అఖిల్!

పరిచయ చిత్రం డిజాస్టర్, సెకండ్ సినిమా ఫ్లాప్ అయితే మామూలు హీరోలకైతే ఇండస్ట్రీలో గుర్తింపు పక్కనపెడితే కనీసం ఉనికిని నిలబెట్టుకోవడం కూడా కష్టమవుతుంది. కానీ.. అఖిల్ కి అక్కినేని వంశం మరియు అక్కినేని అభిమానుల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో మూడో సినిమాకి సంసిద్ధమవుతున్నాడు. నిజానికి జనవరి 10న తన తదుపరి చిత్రం వివరాలను వెల్లడిస్తానని “హలో’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించినప్పుడు చెప్పిన అఖిల్ ఎందుకో సైలెంట్ అయిపోయాడు.

మరీ “అఖిల్” రేంజ్ లో కాకపోయినా “హలో” కూడా ఫ్లాపవ్వడంతో అఖిల్ కాస్త ఢీలాపడ్డాడు. ముఖ్యంగా.. సినిమా బాగున్నప్పటికీ సోలో రిలీజ్ కాకుండా నాని “మిడిల్ క్లాస్ అబ్బాయి”తో పోటీగా రిలీజవ్వడం సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. అయితే.. ఇప్పుడు మూడో సినిమాని త్వరలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాడట. ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు కానీ.. సినిమాను మాత్రం “ఘాజీ, రాజుగారి గది 2” చిత్రాలను నిర్మించిన సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్ టైనెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మార్చిలో లాంఛనంగా మొదలవ్వనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుందట. ప్రస్తుతం హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus