చిన్న సమస్యకు బంద్ చేయడం విడ్డూరం : నట్టి కూమార్‌

  • March 8, 2018 / 11:47 AM IST

డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ క్యూబ్, యుఎఫ్ ఓ, పిఎక్స్ డి సంస్థ‌ల‌కు నిర్మాత‌ల‌కు మ‌ధ్య వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా దక్షిణ చిత్ర పరిశ్రమ మొత్తం థియేటర్ల బంద్ కి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ ఎంత దూరం వెళుతుందోనని అందరూ కంగారు పడ్డారు. అయితే వారంలోనే సమస్యకి పరిష్కారం దొరకడంతో థియేటర్లు తెరుచుకున్నాయి. దీనిపై ఇరువర్గాల వారు సంతోషంగా ఉంటే నిర్మాత నట్టికుమార్‌ మాత్రం విమర్శలు గుప్పించారు. కొందరి స్వార్థ ప్రమోజనాల కోసం థియేటర్ల బంద్‌ జరిగిందని ఆయన ఆరోపించారు. చిన్న సమస్య కోసం ఆరు రోజులు బంద్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

బంద్‌ వల్ల చిన్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఏర్పడిన కోట్ల నష్టాన్ని ఎవరు పూడుస్తారని ఆయన ప్రశ్నించారు. డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌ వంటి నిర్మాతలు ‘డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌’ క్యూబ్‌, యు.ఎఫ్‌.ఓ సంస్థల వెనక ఉండడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని నట్టి కూమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌” అధిక రేట్లు వసూలు చేస్తుండం కారణంగా చూపి బంద్‌ చేశారు. ప్రస్తుతం వారానికి 12 వేలు వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌)గా వసూలు చేస్తుంటే. అందులో రెండు వేలు తగ్గించమని బతిమాలారు. రెండు వేలు కాదు. 10 వేలు తగ్గించి వీపీఎఫ్‌ రెండు వేలు చేయాలి” అని నట్టికుమార్ డిమాండ్ చేశారు. దీనిపై టాలీవుడ్ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus