“బ్రహ్మోత్సవం” లాంటి భారీ డిజాస్టర్ తోపాటు హిట్టైన “ఊపిరి, రాజుగారి గది 2” చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టకపోవడం, చిన్న సినిమాగా తమ బ్యానర్ లో రూపొందిన “క్షణం” పెట్టిన మొత్తానికి మూడింతలు లాభాలు తీసుకురావడంతో.. భీభత్సంగా ఖర్చు చేసి మళ్ళీ అదే స్థాయిలో పబ్లిసిటీ చేసి విడుదల చేస్తున్నా కంటెంట్ కనెక్ట్ అవ్వకపోతే భారీ స్థాయిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పివిపి తనకు అచ్చిచ్చిన చిన్న సినిమాలవైపే మొగ్గుచూపుతున్నాడని తెలుస్తోంది.
అందుకే తన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కి చెప్పేసాడట.. ఒక అయిదారు కోట్ల లోపు సినిమాలు ముందు తీద్దాం.. అంతా సెట్ అయ్యాక భారీ బడ్జెట్ సినిమాలవైపు వెళ్దాం. కొత్త డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేద్దాం అని కూడా అన్నాడట. అయితే.. ఆయన కేవలం చిన్న సినిమాలు మాత్రమే కాక మధ్యలో కథ బాగున్న పెద్ద సినిమాలు కూడా తీస్తే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. పివిపి సంస్థ నుంచి పిలుపు రావడంతో.. చిన్న దర్శకులందరూ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కథలను పట్టుకొని పివిపి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారంట.