బాలయ్య 100వ సినిమా నిర్మాత తప్పుకున్నాడు!

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 100వ ‘యోధుడు’ నుండి నిర్మాత తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాలని క్రిష్ భావించాడు. దీనికోసం సుమారుగా 70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. బాలయ్యతో ‘లెజెండ్’ సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటికి ఈ సినిమాను కూడా నిర్మించే అవకాశం ఇచ్చారు. అయితే సాయి కొర్రపాటి మాత్రం సున్నితంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ‘లెజెండ్’ సినిమా 38 కోట్లు వసూలు చేసింది. 70 కోట్లు బాలయ్య పై వర్కవుట్ కాదేమో.. అని సాయి కొర్రపాటి భావించినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి మరో ప్రొడ్యూసర్ ను చూస్తారో.. లేక బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారా..? అనే విషయాలు తెలియాల్సివుంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus