Dhanush, Aishwarya: ధనుష్ ఐశ్వర్య రియల్ లైఫ్ లో నటించే జంట.. నిర్మాత కామెంట్స్ వైరల్!

ధనుష్ (Dhanush) ఐశ్వర్య (Aishwarya) జోడీకి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్లిద్దరూ విడిగా ఉంటున్నారు. తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కోసం కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2004 సంఫత్సరంలో వీళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 18 సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవనం సాగించగా ఈ దంపతులకు యాత్ర, లింగ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు.

రెండేళ్ల క్రితం ఈ దంపతులు విడిపోతున్నట్టుగా ప్రకటించగా ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ధనుష్, ఐశ్వర్యలను కలపాలని రజనీకాంత్ (Rajinikanth) ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. అయితే తాజాగా ఒక నిర్మాత ధనుష్ ఐశ్వర్య జీవించింది ఫేక్ లైఫ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ నిర్మాత కే రాజన్ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. ధనుష్ ఐశ్వర్య ఆలోచించుకోవాలని కొడుకుల కోసమైనా కలిసి జీవిస్తే బాగుంటుందని రాజన్ అన్నారు. ధనుష ఐశ్వర్య రియల్ లైఫ్ లో కూడా నటించే జంట అని ఆయన తెలిపారు. కాపురంలో తప్పుఒప్పులు ఉంటాయని వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్తే బాగుంటుందని ఆయన కామెంట్లు చేశారు. తమిళ సంస్కృతిని కాపాడాలంటే కలిసిపోండని రాజన్ పేర్కొన్నారు.

ధనుష్ ఐశ్వర్య ఇతని కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ధనుష్ ఐశ్వర్య భవిష్యత్తులో విడాకులకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. ధనుష్, ఐశ్వర్యలను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య రాబోయే రోజుల్లో అభిమానులకు ఎలాంటి షాకులిస్తారో చూడాల్సి ఉంది. ధనుష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని భోగట్టా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus