Vettaiyan Vs Kanguva: రజనీకాంత్, సూర్య బాక్సాఫీస్ పోటీలో ఆ హీరో విజేతగా నిలుస్తారా?

ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలకు సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టమవుతుందనే సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ నెల 10వ తేదీన దేవర సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఓజీ మూవీ (OG Movie) వాయిదా పడటంతో దేవర (Devara)  మేకర్స్ తెలివిగా తమ సినిమాను ప్రీపోన్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27వ తేదీన దేవర మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Vettaiyan Vs Kanguva:

అయితే విచిత్రం ఏంటంటే అక్టోబర్ నెల 10వ తేదీన కంగువా ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా అదే తేదీన వేట్టయాన్ (Vettaiyan) సినిమా కూడా రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది. ఒకే తేదీన సూర్య (Suriya) , రజనీకాంత్ (Rajinikanth)  సినిమాలు థియేటర్లలో విడుదలైతే ఏ సినిమాకు ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా నష్టపోయే ఛాన్స్ ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

రజనీకాంత్ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కథాంశంతో వేట్టయాన్ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. కంగువా  (Kanguva) , వేట్టయాన్ సినిమాల మేకర్స్ తమ సినిమాల రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని అందుకే పోటీకి సైతం సిద్ధమవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రజనీ వర్సెస్ సూర్య బాక్సాఫీస్ పోటీ గురించి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో సైతం చర్చ జరుగుతుండటం గమనార్హం.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలతో పోటీ పడకుండా దేవర ముందుగానే రిలీజ్ అవుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్ల పరంగా ఎలాంటి సమస్య లేదు. దసరా పండుగ సెలవులను క్యాష్ చేసుకునేలా ఈ సినిమాల మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. దేవర, కంగువా, వేట్టయాన్ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

వింత పాత్రలో రాజ్ తరుణ్.. ట్రైలర్ ఇలా ఉందేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus