జాతీయ స్థాయిలో అవార్డులు వస్తాయి.. ఆదిత్య ఓం ‘పవిత్ర’పై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్

యాక్టర్‌గా వెండితెరపై తన టాలెంట్ చూపించి ప్రేక్షకుల మెప్పుపొందిన యువ హీరో ఆదిత్య ఓం డైరెక్టర్ గా కూడా సత్తా చాటారు. సూపర్ సక్సెస్ సినిమాల్లో భగమయ్యారు కెరీర్ పరంగా పూల బాటలు వేసుకున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు పవిత్ర అనే ఓ ప్రయోగాత్మక షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

వెండితెరపై సత్తా చాటి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ఆదిత్య ఓం.. మొట్టమొదటి సారి పవిత్ర అనే షార్ట్ ఫిలిం చేస్తుండటం విశేషం. థ్రిల్లింగ్ జానర్‌లో ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా ప్రీమియర్స్ ప్రదర్శించగా.. సినీ ప్రముఖలంతా షార్ట్ ఫిల్మ్‌ను వీక్షించారు.షార్ట్ ఫిల్మ్‌ను చూసిన అనంతరం ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ, తెలుగు వన్ ఎండీ రవిశంకర్, గజల్ శ్రీనివాస్, అదిరే అభి, జాకీర్ హుస్సేన్, గాయత్రీ గుప్తా, హరిచందన్, రవికిరణ్, శ్రీరాపాక, వైభవ్ సూర్య, జ్యోతి లాభాల, నిర్మాత రఘు, మిస్ ఇండియన్ పసిఫిక్ రష్మీ ఠాకూర్ వంటి వారు పాల్గొన్నారు.

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ షార్ట్ ఫిల్మ్‌ని చూస్తే ఎంతో రియలిస్టిక్‌గా ఉంది. ఓ డాక్టర్ చిన్న తప్పు చేస్తే ఎంతటి అనార్థాలు జరుగుతాయో చూపించారు. నాకు తెలిసిన ఓ వ్యక్తికి కూడా అలానే జరిగింది. క్యాన్సర్ లేకపోయినా ఉందని చెప్పారు.. దాంతో ఆయన చనిపోయేంత వరకు వెళ్లారు. చివరకు క్యాన్సర్ లేదని తెలిసింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లంను ఇందులో చూపించారు. ఇందులో పర్ఫామెన్స్‌లు, కెమెరాపనితనం అద్భుతంగా ఉన్నాయి. జాతీయస్థాయిలో కచ్చితంగా అవార్డులు వస్తాయి. లాహిరి లాహిరి లాహిరి సినిమాతోనే నటుడిగా నిరూపించుకున్నాడు. దర్శకుడిగా ఈ చిత్రం ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. సమాజంలో జరుగుతున్న ప్రాబ్లం గురించి ఎంతో గొప్పగా చూపించాడు. అద్భుతమైన సందేశంతో ఈ సినిమా తీశాడు. ఇలాంటి మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆదిత్య మాట్లాడుతూ.. ‘నేను, అభి ఇద్దరం కలిసి ‘ఒట్టూ.. ఈ అమ్మాయి ఎవరో తెలీదు’ సినిమా సమయంలో కలిశాను. ఆనాడే చెప్పాను.. అతనొక పెద్ద స్టార్ అవుతాడు అని. ఈ రోజు ఇక్కడ ఉన్న వారిలో ఆయనే పెద్ద స్టార్. ప్రసన్న గారితో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది.వైవీఎస్ చౌదరి గారు నాకు బ్రేక్ ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో సమస్యలు వస్తే ప్రసన్న గారు సాయం చేశారు. 2016లో ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమా తీశాను. అప్పుడు కూడా ఆయన వచ్చి కో ఆపరేట్ చేశారు. మా ఎండీ రవి గారు మా అందరికీ పయోనీర్ లాంటి వారు. ఎంతో మంది యంగ్ టాలెంట్‌కు సపోర్ట్ చేస్తున్నారు. బంధీ సినిమాను చేశాం. డీఓపీ మధుసూదన్ గారిని అనుకోకుండా కలిశాను. సినిమాలు,యాడ్ ఫిల్మ్స్ కలిసి చేశాం. మా అన్నలాంటివారు.. ఆయన నాకు కంటిచూపు వంటివారు. రైటర్ హరిచందన్ గారితో ఓ వెబ్ సిరిస్ ప్లాన్ చేశాను. గజల్ గారిని చంబల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలిశాను. ప్రకాష్ నా సినిమాలకు ఎడిటర్‌. ఆయన వల్లే ఎంతో మంది హిందీలో దర్శకులయ్యారు. 2006లో నా పరిస్థితి బాగా లేనప్పుడు జాకీర్ ఇంట్లోనే ఉన్నాను.. నా దగ్గర డబ్బుల్లేని సమయంలో నీడనిచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహ్మద్ నా దగ్గర డ్రైవర్‌‌గా వచ్చాడు.. ఇప్పుడు దాదాపుగా 20 చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. మీ అందరూ షార్ట్ ఫిల్మ్‌ని చూసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అదిరే అభి మాట్లాడుతూ.. ‘ఆదిత్య గారితో నాది 20 ఏళ్ల బంధం. ఓ సినిమాలో ఫ్రెండ్ కారెక్టర్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బంధం కొనసాగుతోంది. నేను ఓ సారి ముంబైకి వెళ్తే వాళ్లింట్లోనే ఉన్నాను. అది ఎప్పటికీ మరిచిపోలేను. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో ఆదిత్యను చూసి తెలుగువాడని అనుకున్నారు. కానీ ముంబై నుంచి వచ్చి నటించాడని తరువాత తెలిసింది. అలాంటి నటుడి గురించి తెలుగు నిర్మాతలు ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కాలేదు. మాస్ సాబ్ అనే సినిమాకు దర్శకుడిగా అవార్డులు వచ్చాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది హాలీవుడ్ రేంజ్ సినిమాతో పోటీ పడింది. ఆయన లాంటి టాలెంట్ ఉన్నవాళ్లని తెలుగు నిర్మాతలు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పవిత్ర షార్ట్ ఫిల్మ్‌లో ఆదిత్య షారుఖ్ ఖాన్‌లా అనిపించారు. ఆయన టాలెంట్‌ను అందరూ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.

తెలుగు వన్ ఎండీ రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ఆదిత్యకు, అతని టీంకు ఆల్ ది బెస్ట్. నేను ఫిల్మ్ క్రిటిక్‌ను కాదు కాబట్టి నిర్మాతగా మాట్లాడతాను. కొన్ని హిందీ సినిమాలను చూసినప్పుడు అలాంటివి ఎప్పుడు వస్తాయా? అని అనుకునేవాడిని. అలాంటి కోవలకే ఈ చిత్రం వస్తుంది. చిన్న స్క్రీన్ మీద కూడా ఇలాంటి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఆదిత్య నా సోదరుడి వంటి వారు. చంబల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలిశాం. ఆయన్ను చూడగానే ఎంతో సంతోషంగా అనిపించింది. అక్కడే మంచి థాట్ ప్రొవొకింగ్ సినిమాను తీశారు.మీలాంటి మల్టీ టాలెంటెడ్ వ్యక్తిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిస్ అవుతుంది. మీ విజయం అంటే మా అందరి విజయం. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హరిచందన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో ఆదిత్య గారు బాగా చేశారు. నా సినిమాలో స్టైలీష్ కార్పోరేట్ విలన్‌గా నటించారు. ఆయనతో పని చేయడం నాకు ఆనందంగా ఉంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. జ్యోతి, గాయత్రి, జాకీర్ ఇలా అందరూ బాగా నటించారు. టీం మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాట్స్’ అని అన్నారు.

ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆదిత్య అందరికీ తెలిసిన హీరో. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ అన్నీ కూడా బాగున్నాయి. ఇలాంటి కథను ఎంచుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతున్నాను’ అని అన్నారు.

గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. ‘ఆదిత్య నేను ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యాం. తనతో కూర్చున్న ప్రతీ సారి ఎంతో కొంత నేర్చుకుంటాను. ఆయన హైద్రాబాద్ వచ్చినప్పుడల్లా కలుస్తుంటాను. డిప్రెషన్ స్టేజ్ నుంచి మేనియా స్టేజ్ వరకు ఎలా వెళ్తారు అనేది చూపించారు. ఇందులో నటించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆదిత్యతో కలిసి ఇంకొన్ని చిత్రాలు చేయాలనుంది’ అని అన్నారు.

జాకీర్ మాట్లాడుతూ.. ‘ఆదిత్య నాకు బ్రదర్ లాంటి వారు. ఆయన సినీ ఎన్‌సైక్లోపీడియా. నాకు ఏ అనుమానం వచ్చినా ఆయన్ను అడుగుతుంటాను. ఎంతో నాలెడ్జ్ ఉంది. అందుకే మనవాళ్లు అతడ్ని క్యాచ్ చేయలేకపోతున్నారేమోననిపిస్తుంది. ఈ సినిమాలో కాన్సెప్ట్, షాట్ డివిజన్స్, కెమెరాపనితనం అద్భుతంగా ఉంది.దీనికి సీక్వెల్ కూడా తీయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి మాట్లాడుతూ.. ‘రీసెంట్‌గా పవిత్ర షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మేం అంతా చూశాం. షార్ట్ ఫిల్మ్ అయినా కూడా అదొక సైకిక్ థ్రిల్లర్. పవిత్ర రోల్‌ను నేను పోషించాను. ఆ పాత్రను నాకు ఇచ్చినందుకు ఆదిత్య ఓం గారికి థ్యాంక్స్. చాలా గ్యాప్ తరువాత ఇలాంటి మంచి పాత్రను పోషించాను. ఇది నా వల్ల అవుతుందా? అని మొదట్ల కాస్త అనుమానపడ్డాను. నన్ను ఎక్కువగా ఆదిత్య ఓం గారు నమ్మారు. మీరు ఈ సినిమాను మిస్ అవ్వకండి. షార్ట్ ఫిల్మ్ థ్రిల్లర్‌ మీ అందరికీ నచ్చుతుంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా అద్భుతంగా చేశారు. మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుతున్నాను. ఇంకా మాకు ఇలాంటి మంచి పాత్రలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. గాయత్రి గుప్తా, జాకీర్‌లు మంచి పాత్రలను పోషించారు. మంచి టీంతో పని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. పవిత్ర షార్ట్ ఫిల్మ్‌ను మిస్ అవ్వకండ’ని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus