రెమ్యూనరేషన్ తీసుకొని కూడా ప్రమోషన్స్ కి రావడం లేదని నిర్మాత ఫైర్

అసలే తెలుగమ్మాయిలకి తెలుగు సినిమాల్లో ఆఫర్లు రావడం లేదని మనోళ్ళందరూ తెగ బాధపడిపోతుంటారు. రీసెంట్ గా చాందిని చౌదరి అయితే.. తెలుగు హీరోయిన్లను తెలుగులో ఎందుకు ఎంకరేజ్ చేయరు అని ఒక పెద్ద లెటర్ కూడా రాసింది. అయితే.. ఉన్న అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోవడం లేదు తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ. “అరవింద సమేత” అనంతరం తెలుగులో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ అవకాశం కూడా దక్కించుకోలేకపోయిన ఈష రెబ్బ ఎట్టకేలకు “రాగాల 24 గంటల్లో” అనే సినిమాలో కథానాయికగా అవకాశాన్ని సొంతం చేసుకొంది.

చిన్న సినిమానే అయినప్పటికీ.. టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ థ్రిల్లర్ ప్రమోషన్స్ కి ఈమధ్య ఈషా రెబ్బ అటెండ్ అవ్వడం లేదు. అందుకు కారణం ఏమిటి అనేది తెలియడం లేదు. అయితే.. నిర్మాతలు మాత్రం 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొంది కానీ ప్రమోషన్స్ కి మాత్రం రావడం లేదు అని వాపోతున్నారు. కాకపోతే.. ఈ సినిమా కోసం “రెబ్బా ఈషా రెబ్బ” అనే స్పెషల్ సాంగ్ ను ఈషా లేకుండా షూట్ చేశారట. ఆ విషయంలో అలిగిన ఈషా రెబ్బ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుందని టాక్.

1

2

3

4

5

6

7

8

9

10

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus