చిరు – కొరటాల… చిత్రం పై క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్స్..!

మెగాస్టార్ 152 వ చిత్రం కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కొరటాల శివ చెప్పిన కథ నచ్చకపోవడంతో చిరంజీవి.. రిజెక్ట్ చేసారని.. అందుకే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్టు చిరు ప్రకటించేశారని పుకార్లు షికార్లు చేసాయి. అయితే ఆ వార్తల్లో నిజంలేదని చరణ్ క్లారిటీ కూడా ఇచ్చేసాడు. ‘సైరా నరసింహ రెడ్డి చిత్రం పూర్తయిన వెంటనే కొరటాల శివ డైరెక్షన్లో చిత్రం మొదలు కాబోతుందని చరణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. “చిరంజీవి, కొరటాల శివ సినిమాకు సంబంధించి వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజంలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే కొరటాల శివ డైరెక్షన్లో చేయబోయే చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది”… అంటూ పేర్కొన్నారు.ఇక ఈ చిత్రాన్ని ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ సంస్థలు కలిసి నిర్మించబోతున్నాయి. ఇక ఈ చిత్రంలో నయనతార లేదా అనుష్క… వీరిద్దరిలో ఒకరు హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కూడా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఉగాది పండుగ సందర్బంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus