బాలయ్య అంటే భయపడిఛస్తున్నారట!

సాధారణంగా స్టార్ హీరోలంటే విపరీతమైన అభిమానం, పిచ్చి ప్రేమ, గౌరవం ఉంటాయి. కానీ.. వీటన్నిటికంటే ఎక్కువగా భయాన్ని పరిచయం చేసిన కథానాయకుడు మాత్రం బాలకృష్ణ. పబ్లిక్ ఈవెంట్స్ లో అభిమానుల్ని, అసిస్టెంట్స్ ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. బాలయ్యతో జాగ్రత్తగా ఉండాల్రా బాబూ అని అందరూ అనుకొనే స్థాయిలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశాడు. అభిమానులకైతే బాలయ్య చేత కొట్టించుకోవడం ఒక సరదా అని బాలయ్యతోపాటు “పైసా వసూల్” దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా పేర్కొన్నారు కాబట్టి సరిపోయింది కానీ.. అసిస్టెంట్స్ కి అంత వెర్రి అభిమానం ఉండదు కదా.

అసలు విషయం ఏంటంటే.. సి.కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం షూటింగ్ ప్రారంభం రోజున బాలయ్య ఒక అసిస్టెంట్ మీద చెయ్యి చేసుకొన్నాడు. ఆ తర్వాత కూడా అదే తరహా చెయ్యి దురుసును ఇంకొందరిపై ప్రదర్శించాడట. దాంతో ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేసే అసిస్టెంట్స్ అందరూ “బాబోయ్ బాలయ్య” అంటూ బాలకృష్ణకి డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతోపాటు ఆయనకి అసిస్టెంట్ గా వెళ్ళమని ఫోర్స్ చేస్తుంటే.. “ఉద్యోగం మానేయడానికైనా సిద్ధం కానీ.. ఆయన దగ్గర వర్క్ చేయలేం” అంటూ చేతులెత్తేస్తున్నారట. దాంతో.. షూటింగ్ కి వనరులు సమకూర్చడం కంటే.. బాలయ్యకి ఒక పర్సనల్ అసిస్టెంట్ ను సెట్ చేయడానికి సి.కళ్యాణ్ ఎక్కువ కష్టపడుతున్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus