Prabhas, Deepika: మెల్లమెల్లగా లీక్‌ అవుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ వివరాలు!

ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’… ఈ సినిమా ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువే అని చెప్పాలి. సినిమా పేరు కూడా వర్కింగ్‌ టైటిలే. సినిమాలో ప్రభాస్‌ హీరో అయితే, దీపిక పడుకొణె హీరోయిన్‌. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక్కడి వరకు చాలా పాత విషయాలు. ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. అమితాబ్ బచ్చన్‌ పేరు ఇదే, పాత్ర ఇదేం అంటూ వార్తలొచ్చాయి. ఇంకా ఆ విషయం వైరల్‌ అవుతుండగా, మరో రెండు విషయాలు తెలుస్తున్నాయి.

Click Here To Watch NEW Trailer

సినిమాలో ప్రభాస్‌, దీపిక పడుకొణె పాత్రలకు సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది. ముందుగా తెలిసిన వివరాల ప్రకారం ‘ప్రాజెక్ట్‌ కె’లో అమితాబ్‌ బచ్చన్‌ అశ్వద్ధామ అనే పాత్రలో కనిపిస్తారు. అతనో బడా వ్యాపారవేత్త. ప్రభాస్‌ అతని కొడుకుగా సినిమాలో కనిపిస్తాడు అనేది లేటెస్ట్‌ టాక్‌. అశ్వద్ధామ స‌హాయ‌కురాలిగా దీపికా ప‌డుకొణె న‌టించ‌బోతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌, దీపిక మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా ఉంటాయి అంటున్నారు.

సినిమా ప్రారంభమైన దగ్గర నుండి ఈ సినిమా టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో ఉంటుందని వార్తలొస్తున్నాయి. దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి సమాచారం లేదు. కానీ టాలీవుడ్‌ వర్గాలు మాత్రం ఇదే మాట చెబుతున్నాయి. ఈ క‌థంతా టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో సాగ‌బోతోందట. కాలాన్ని ఆప‌డం, భూత‌, భ‌విష్య కాలాల్లోకి వెళ్లి రావ‌డం, ఈ క్రమంలో అక్కడ జరిగే విషయాలు చూపించడమే ఈ సినిమా అంటున్నారు. ఈ క్రమంలో కొన్ని పురాణ పురుషుల పాత్ర‌లు కూడా ఉండ‌బోతున్నాయట.

సినిమాకు వర్కింగ్‌ టైటిల్‌గా ‘ప్రాజెక్ట్‌ కె’ అని పెట్టడం వెనుక కూడా పెద్ద కారణమే ఉందట. సినిమాలో హీరో పేరు ‘కె’ అనే అక్షరంతోనే స్టార్ట్‌ అవుతుందని చెబుతున్నారు. సినిమా పేరు కూడా ఆ అక్షరంతోనే స్టార్ట్‌ అవ్వొచ్చనే వార్తలూ వస్తున్నాయి. మరి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆలోచన ఎలా ఉందనేదే ఇక్కడ విషయం. అన్నట్లుగా ఈ సినిమాకు నిర్మాత అశ్వనీదత్‌ సుమారు రూ. 500 కోట్లు ఖర్చ పెడుతున్నారని చెబుతున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus