Project Z OTT: యూట్యూబ్‌లో ఇప్పటికే చూసేసిన సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చి..

  • May 29, 2024 / 10:54 AM IST

థియేటర్లలో విడుదలైన వారానికి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్న రోజులివి. అయితే అలా వచ్చేయడానికి చాలా కారణాలు ఉంటాయి అనుకోండి. అయితే ఓ సినిమా వచ్చిన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఆ సినిమానే ‘ప్రాజెక్ట్‌ జెడ్‌’. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) , లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంటగా నటించిన ఈ సినిమానే ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం ఈ సినిమా తమిళంలో విడుదలైంది. అయితే ఈ సినిమాను ఇటీవల ‘ప్రాజెక్ట్‌ జెడ్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్‌ రియాక్షన్‌ వచ్చింది. సందీప్‌కిషన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించిన ఈ సినిమా ప్రయత్నానికి మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది. ఆ సినిమాను ఓటీటీలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆహాలో మే 31వ నుండి ఈ సినిమాను స్ట్రీమ్‌ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే.. కుమార్‌ (సందీప్‌ కిషన్‌) ఓ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌. చిల్లర దొంగను పట్టుకునే క్రమంలో జిమ్‌ ట్రైనర్‌ (సాయి దీనా) అతని భార్యను హత్య చేయడం చూస్తాడు.

దీంతో హంతకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగి కుమార్‌ పొడవటంతో జిమ్‌ ట్రైనర్‌ అక్కడికక్కడే మరణిస్తాడు. గాయాలపాలైన కుమార్‌ కోలుకున్న తర్వాత ఉద్యోగంలో తిరిగి చేరడానికి మెంటల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో సైకోథెరపిస్ట్‌ అదిర (లావణ్య త్రిపాఠి)తో కుమార్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది.

అదే సమయంలో నగరంలో వరుసగా ఒకే తరహా హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు చేస్తున్నది ఎవరు అనేది తేల్చడం సినిమా ప్రధాన కథ. రక్తం చూస్తే భయపడిపోయే కుమార్‌ గతం ఏంటి? అనేది మరో పాయింట్‌. వరుస హత్యలను ఛేదించడానికి వెళ్లిన కుమార్‌ టీమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా నిలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus