‘లైలా’ (Laila) సినిమా ఈవెంట్లో పృథ్వీ రాజ్ (Prudhvi Raj) చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ‘బాయ్ కాట్ లైలా’ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఎక్కువ శాతం అందులో వైసీపీ శ్రేణులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు 30 ఇయర్స్ పృథ్వీ వైసీపీ పార్టీలో ఉండేవాడు కాబట్టి.. అతని ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పుట్టి చాలా మంది అతన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. దీంతో అతను మళ్ళీ రెచ్చిపోయాడు.
ఈ క్రమంలో సినిమా యూనిట్ ఒత్తిడి వల్ల అతను తగ్గక తప్పలేదు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఒక వీడియో పెట్టాడు. పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. “నేను పెట్టిన వీడియో సరిపోలేదట. అందుకే ఇంకో వీడియో పెట్టామన్నారు. గోదావరిలో పుట్టి పెరిగాను కాబట్టి.. మాకు వెటకారం అనేది వెన్నతో పెట్టిన విద్య. అందువల్ల కొంచెం మాటలు వేరేలా వెళ్లి ఉండవచ్చు. ఒక సినిమా నటుడిగా నేను కోరుకునేది ఒక్కటే. సినిమా మీదే నేను భోజనం చేస్తున్నాను.
కాబట్టి ‘డోంట్ బాయ్ కాట్ లైలా.. వెల్కమ్ టు లైలా’. విశ్వక్ సేన్ (Vishwak Sen) గారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. అందరూ వాలెంటైన్స్ డే రోజున ‘లైలా’ తో ఎంజాయ్ చేయండి. నాకు ఫోన్ చేసిన వ్యక్తి చాలా ఘోరంగా మాట్లాడాడు. నా తల్లి గురించి నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చనిపోయిన నా తల్లి ఏం చేసింది రా.? నీ వల్ల నాకు బీపీ పెరిగింది. ఆరోగ్యం దెబ్బతింది. అయినప్పటికీ మీ మాటలు కూడా వెనక్కి తీసుకుంటూ ఒక వీడియో పెట్టండి” అంటూ చెప్పుకొచ్చాడు.