‘హిట్2’ తో పాటు టాలీవుడ్లో రూపొందిన 10 సైకో కిల్లర్ మూవీస్ లిస్ట్..!

థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య తెలుగులో కూడా ఎక్కువే..! ముఖ్యంగా సైకో కిల్లర్ నేపథ్యంలో రూపొందిన మూవీస్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలు చేయడానికి దర్శకులు ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే సైకోలు లాజిక్స్ ప్రకారం మర్డర్లు చేయరు. వాళ్ళను మానసికంగా ఏదో ఒక సంఘటన ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ కోణంలో అది తప్పు. అందుకే ఇలా మర్డర్లు చేస్తున్నట్టు సినిమాలో చూపిస్తారు. కానీ థ్రిల్లర్ అనేసరికి లాజిక్ లు పర్ఫెక్ట్ గా కాకపోయినా దగ్గరదగ్గర్లో అయినా ఉండాలి. లేదంటే అది రిస్కీ ప్రాజెక్టు అవుతుంది. తెలుగులో కూడా కొన్ని సైకో కిల్లర్ నేపథ్యం కలిగిన సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి. ఇంకొన్ని ఫ్లాప్ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎవరు(1999) :

‘రంగీలా'(‘రంగేళి’ తెలుగులో) ఫేమ్ ఊర్మిళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైకో కిల్లర్ మూవీకి రాంగోపాల్ వర్మ దర్శకుడు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి కథ అందించాడు. 1999 లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో 4 రోజులు కూడా ఆడలేదు. కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తుంది. కేవలం 15 రోజుల్లోనే ఈ మూవీని తెరకెక్కించాడు వర్మ.

2) ఏ ఫిలిం బై అరవింద్ :

2005 లో వచ్చిన ఈ మూవీకి శేఖర్ సూరి దర్శకుడు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది.

3) మంత్ర :

‘మాహ.. మాహ’ అంటూ సాగే పాట అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఓషో తులసి రామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

4) అనసూయ :

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా సైకో కిల్లర్ నేపథ్యంలో రూపొందిన మూవీనే..! భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

5) అనుక్షణం :

మంచు విష్ణు హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా సైకో కిల్లర్ నేపథ్యంలో రూపొందిన మూవీనే..!సినిమా బాగానే ఉంటుంది కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు.

6) ఐస్ క్రీమ్ 2 :

‘ఐస్ క్రీమ్’ అనే సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు అనే పగతో రాంగోపాల్ వర్మ తీసిన సినిమా ఇది. నిజంగా ‘ఐస్ క్రీమ్’ తో ఈ మూవీ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది కూడా సైకో కిల్లర్ నేపథ్యంలో రూపొందిన మూవీ..!

7) క్షణం :

ఇది కూడా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందింది. ఓ సైకో తన స్వార్థం కోసం చేసిన ఘోరాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అడివి శేష్ కి హీరోగా లైఫ్ ఇచ్చిన మూవీ ఇది.

8) స్పైడర్ :

ఈ సినిమాలో సైకో ఎవరో అందరికీ తెలుసు. ఎందుకు సైకోగా మారాడో కూడా అందరికీ చూశారు. మహేష్ బాబు సినిమా కాబట్టి..! కానీ మహేష్ ఇమేజ్ కు ఈ కథ సెట్ అవ్వకపోవడం అలాగే పాటలు కూడా సినిమా మూడ్ ను డిస్టర్బ్ చేసే విధంగా ఉండటంతో సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

9) సవ్యసాచి :

ఈ సినిమాలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులను చంపడం కోసం సైకోగా మారతాడు విలన్. అందుకు సరైన లాజిక్స్ కన్విన్సింగ్ గా లేకపోవడం వల్ల సినిమా ప్లాప్ అయ్యింది.

10) రాక్షసుడు(రాట్ససన్) :

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్ససన్’ కు రీమేక్ గా తెరకెక్కిన మూవీ ఇది. సైకో థ్రిల్లర్ గా రూపొందిన మూవీనే…! ఇక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది ఈ మూవీ..!

11) హిట్2 :

అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో ‘హిట్’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ కూడా సైకో థ్రిల్లర్ గా రూపొందిన మూవీనే..!శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు.దీనికి కూడా పాజిటివ్ టాక్ లభిస్తుంది.

12) కిన్నెరసాని :

ఈ మూవీలో కూడా ఓ సైకో మర్డర్లు చేస్తుంటాడు. అది ఎందుకు అన్నది పాయింట్. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. పర్వాలేదు అనిపించే విధంగా టాక్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాలో హీరో..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus