ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు!

  • December 23, 2017 / 11:24 AM IST

వరుసబెట్టి ఏడు హిట్ సినిమాలున్న నాని ఎనిమిదవ సినిమాకి క్రేజ్ రావడం, భారీ ఓపెనింగ్స్ రావడం అనేది సర్వసాధారణం. అదేదో గొప్పదనమని ఫీల్ అవ్వడం సబబు కాదు. సినిమా చూసినవాళ్లలో ఒక 20 లేదా 30% మంది బాలేదు అంటే.. మిగతా వారికి నచ్చింది అనుకోవచ్చు. కానీ ఏకగ్రీవంగా 70% పైగా జనాలు సినిమా బాలేదు అని తేల్చి చెప్పేయడంతోపాటు నాని ఇకనుంచైనా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని ప్రేమగా చెప్పారు. అయితే.. దర్శకనిర్మాతలు మాత్రం ప్రేక్షకులు ప్రేమతో చెప్పిన విషయాల్ని ఖాతరు చేయకుండా మా సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇంత షేర్ వచ్చింది అంటూ బ్లాక్ బస్టర్ అని ప్రమోట్ చేసుకొంటున్నారు.

సినిమాకి డబ్బులు రావడానికి, హిట్ అవ్వడానికి చాలా తేడా ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన “సర్దార్ గబ్బర్ సింగ్” కూడా 90 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అలాంటిది వరుస విజయాల జోరుమీదున్న నాని సినిమా మొదటిరోజు లేదా మొదటివారం భారీ కలెక్షన్స్ రాబట్టడం అనేది ప్రస్తుతం దిల్ రాజు అండ్ టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ కి అంత కష్టమేమీ కాదు. మరి ఎందుకీ మోకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకుల్ని ఎలాగూ మోసం చేస్తూనే ఉన్నారు. అలాగే తమని తాము ఎందుకు మోసం చేస్తున్నారు. ఇంకా ఏమైనా అంటే ఈ రివ్యూ రైటర్ల వల్ల సినిమా చచ్చిపోతుంది అని పబ్లిక్ గా కామెంట్స్ చేసే నిర్మాతలు. అదే రివ్యూ రైటర్ల కారణంగా తమ సినిమాల కలెక్షన్స్ పెరిగినప్పుడో మంచి టాక్ వచ్చినప్పుడో ఎందుకని కనీసం వారికి కృతజ్నతలు కూడా చెప్పడం లేదు.

ఒక మంచి సినిమా బాలేదు అని వంద మంది చెప్పినా ఆ సినిమాకి చెడు జరగదు. అలాగే ఒక చెత్త సినిమాని వెయ్యి మంది బాగుందని చెప్పినా ప్రేక్షకులు ఒక్కసారి చూసి “బాలేదు” అని డిసైడ్ అయ్యారంటే కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసినా థియేటర్ల వద్దకి ప్రేక్షకులను తీసుకురాలేరు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus