పులిజూదం

  • March 21, 2019 / 03:59 PM IST

మోహన్ లాల్, విశాల్ ప్రధాన పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన చిత్రం “విలన్”. హన్సిక, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటించడం విశేషం. 2017లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మిశ్రమ స్పందనతో సరిపెట్టుకొంది. ఆ చిత్రాన్ని “పులిజూదం” పేరుతో తెలుగులోకి అనువదించి ఇవాళ విడుదల చేశారు. ఈ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: మేథ్యూ (మోహన్ లాల్) ఒక యాక్సిడెంట్ లో తన భార్య, కుమార్తెను కోల్పోయి.. ఆ బాధలో పోలీస్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఫిక్సవుతాడు. సరిగ్గా అదే రోజు నగర శివారుల్లో ఓ ముగ్గురు హై ప్రొఫైల్ వ్యక్తులు హత్య చేయబడతారు. ఆ హత్యలు కిరాతకంగా కాక చాలా ప్లాన్డ్ గా ఉండడంతో ఇది మేథ్యూ మాత్రమే డీల్ చేయగల కేస్ అని కమిషనల్ కోరతాడు. కమిషనల్ కోరిక మేరకు కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన మేథ్యూకి ఈ వరుస ప్లాన్డ్ మర్డర్స్ వెనుక డాక్టర్ మదనగోపాల్ (విశాల్) మరియు అతడి ప్రియురాలు శ్రేయ (హన్సిక) ఉన్నారని తెలుసుకొంటాడు. కానీ.. ఈ హత్యల వెనుక వాళ్ళ మోటివ్ ఏమిటనేది తెలుసుకొనే క్రమంలో కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకొంటాడు.

ఏమిటా నిజాలు? అసలు ఈ మదనగోపాల్-శ్రేయలు ఎందుకని హత్యలు చేస్తుంటారు? వంటి ప్రశ్నలకు సమాధాన రూపమే “పులిజూదం” చిత్రం.

నటీనటుల పనితీరు: సంపూర్ణ నటుడు మోహన్ లాల్ ఈ చిత్రంలోనూ తన నట విశ్వరూపం ప్రదర్శించారు. టైట్ క్లోజ్ షాట్స్ లో ఆయన కేవలం కళ్ళతోనే పలికించే హావభావాలు చూస్తే అర్ధమవుతుంది ఆయన్ను సంపూర్ణ నటుడు అని ఎందుకు అంటారో.

విశాల్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. అతడికి సహాయకురాలిగా హన్సిక గ్లామర్ ను యాడ్ చేయగా.. పోలీస్ ఆఫీసర్ గా రాశీఖన్నా రోల్ కి కరెక్ట్ గా సరిపోయింది. శ్రీకాంత్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. స్టైలిష్ విలన్ గా పర్వాలేదనిపించుకొన్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: సుశిన్ శ్యామ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. మనోజ్ పరమహంస యాక్షన్ బ్లాక్స్ కి పెట్టిన ఫ్రేమ్స్ స్టైలిష్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యుస్ రిచ్ గా ఉన్నాయి. ఉన్నికృష్ణన్ ఎంచుకున్న కథలో ఉన్న దమ్ము.. కథనంలో లోపించింది. కొన్ని ట్విస్టులు బాగానే ఆకట్టుకున్నాయి కానీ.. కొన్ని మాత్రం అందరూ గెస్ చేసేవే. ముఖ్యంగా.. విశాల్-హన్సిక పాత్రలు, వారి వ్యవహార శైలిని రివీల్ చేసిన విధానం మరీ పేలవంగా ఉంది. కథకి చాలా ముఖ్యమైన వారి పాత్రలకు ఒక పర్టీక్యులర్ ట్రాక్ అనేది లేకుండా వదిలేయడం అనేది పెద్ద మిస్టేక్.

ఒక థ్రిల్లర్ సినిమాను నడిపించడానికి కీలకమైన సస్పెన్స్ & సర్ప్రైజ్ ఎలిమెంట్స్ సినిమాలో మిస్ అయ్యాయి. అందువల్ల “పులిజూదం” ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

విశ్లేషణ: 2017లోనే మలయాళ ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన ఒక చిత్రాన్ని 2019లో విడుదల చేయడమే పెద్ద రిస్క్. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు, గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి సినిమా ఆడేస్తుందని అనుకొంటే తప్పే అవుతుంది. ఎన్ని ఉన్నా కూడా సినిమాలో దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఈ “పులిజూదం”లో లేదు.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus